మంగళవారం, మార్చి 06, 2018

మేలుకోరాదా... కృష్ణా...

కృష్ణావతారం చిత్రంలోని ఒక సరదా ఐన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కృష్ణావతారం (1982)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : సినారె
గానం : బాలు, సుశీల, శైలజ

మేలుకోరాదా... కృష్ణా... మేలుకోరాదా
మేలుకోరాదా... కృష్ణా... మేలుకోరాదా

నలుగురి మేలు కోరే వాడా... మమ్మేలుకోవేరా
మేలుకోరాదా... కృష్ణా... మేలుకోరాదా
నలుగురి మేలు కోరే వాడా... మమ్మేలుకోవేరా
మేలుకోరాదా...

ఆ...  ఆ... ఆ...  ఆ...  ఆ...  ఆ
జేబుదొంగలు లేచారు...  దొరబాబు దొంగలు లేచారు
తడిగుడ్డలతో గొంతులు కోసే దగాకోరులు లేచారు
జేబుదొంగలు లేచారు...  దొరబాబు దొంగలు లేచారు
తడిగుడ్డలతో గొంతులు కోసే దగాకోరులు లేచారు
బడా చోరులూ.. ఊ... ఊ... లేచారూ

ఎవడి దవడ నీ చేతి చలవతో ఎన్ని తునకలు కానుందో
ఏ జైలు నీ రాక కోసమై ఎంతగా ఎదురు చూస్తుందో
ఎవడి దవడ నీ చేతి చలవతో ఎన్ని తునకలు కానుందో
ఏ జైలు నీ రాక కోసమై ఎంతగా ఎదురు చూస్తుందో
ఎన్నికళ్ళతో..ఓ... ఓ... చూస్తుందో

మేలుకోరాదా... కృష్ణా... మేలుకోరాదా
నలుగురి మేలు కోరే వాడా... మమ్మేలుకోవేరా
మేలుకోరాదా...


మేలుకునే ఉన్నాం హమేషా మేలుకునే ఉంటాం
నలుగురి మేలు కోసం రేతిరి కూడా మేలుకునే ఉంటాం
ఖబడ్దార్...

మేలుకునే ఉన్నాం హమేషా మేలుకునే ఉంటాం
నలుగురి మేలు కోసం రేతిరి కూడా మేలుకునే ఉంటాం
మేలుకునే ఉంటాం ...

ఉన్నోడికేమో తిన్నదరగదూ... లేనోడికా తిండే దొరకదు
ధర్మానికేమొ మొద్దు నిద్దరా... ఆ... దేవుడికా తీరికేదిరా

అందుకే మనం పుట్టాం...  తొడ గొట్టాం
అందుకే మనం పుట్టాం...  తొడ గొట్టాం
అన్యాయాన్ని చావబాదె డ్యూటీ చేపట్టాం 


2 comments:

ఈ మూవీ చాలా బావుంటుంది..నేను చాలాసార్లు చూశానండీ..నైస్ సాంగ్..

ఓహ్ అవునా నేనెపుడో చిన్నపుడు చూసినగుర్తేనండీ మళ్ళీ ఓ సారి చూడాలి. థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.