మంగళవారం, నవంబర్ 14, 2017

ఒక విత్తనం (జాగో జాగోరే)...

ఈ రోజు బాలల దినోత్సవం సంధర్బంగా వారికి శుభాకాంక్షలు అందజేసుకుంటూ.. వారిలో స్ఫూర్తి నింపే ఈ చక్కని గీతాన్ని తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : గోల్కొండ హైస్కూల్ (2011)
సంగీతం : కళ్యాణి మాలిక్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : హేమచంద్ర

ఒక విత్తనం మొలకెత్తడం సరికొత్తగా గమనించుదాం
నిలువెత్తుగా తల ఎత్తడం నేర్పేందుకదే తొలి పాఠం
మునివేళ్ళతొ మేఘాలనే మీటేంతగా ఎదిగాం మనం
పసివాళ్ళలా ఈ మట్టిలో ఎన్నాళ్ళిలాగ పడిఉంటాం
కునికే మన కనురెపల్లొ వెలిగిద్దాం రంగుల స్వప్నం
ఇదిగొ నీ దారిటు ఉందని సూరిడిని రా రమ్మందాం

జాగో జాగొరే జాగొ జాగో జాగొరే జాగొ జాగో జాగొరే జాగొ
జాగో జాగొరే జాగొ జాగో జాగొరే జాగొ జాగో జాగొరే జాగొ

ఆకాశం నుండి సూటిగా దూకేస్తే ఉన్నపాటుగా
ఎమౌతానంటు చినుకు అలా ఆగిందా బెదురుగా
కనుకే ఆ చినుకు ఏరుగా.. ఆ ఏరే వరద హోరుగా
ఇంతింతై ఎదిగి అంతగా అంతెరుగని సంద్రమైందిగా
సందేహిస్తుంటే అతిగా.. సంకల్పం నెరవేరదుగా
ఆలోచన కన్నా త్వరగా..అడుగేద్దాం ఆరంభంగా

జాగో జాగొరే జాగొ జాగో జాగొరే జాగొ జాగో జాగొరే జాగొ
జాగో జాగొరే జాగొ జాగో జాగొరే జాగొ జాగో జాగొరే జాగొ

ఏ పని మరి ఆసాద్యమేం కాదే ఆ నిజం మహా రహస్యమా
వేసే పదం పథం పదే పదే పడదోసే సవాళ్ళనే ఎదుర్కోమా
మొదలెట్టక ముందే ముగిసే కధ కాదే మన ఈ పయనం
సమరానికి సై అనగలిగే సంసిద్దత పేరే విజయం

జాగో జాగొరే జాగొ జాగో జాగొరే జాగొ జాగో జాగొరే జాగొ
జాగో జాగొరే జాగొ జాగో జాగొరే జాగొ జాగో జాగొరే జాగొ

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.