బుధవారం, సెప్టెంబర్ 13, 2017

ఇంత చల్లని రేయి / అంచెలంచెలు లేని...

జన్మాష్టమి సంధర్బంగా మిత్రులందరకూ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కన్నయ్య పాటను తలచుకుందామా. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కృష్ణలీలలు (1956)
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి
సాహిత్యం : ఆరుద్ర
గానం : జిక్కి

అందాల గని ఈ బృందావని
లావణ్య రమణి మా యమునా నది
ఎలుగెత్తి పిలిచాయి లేలేమ్మని  

ఇంత చల్లని రేయి ఇంత చక్కని హాయి
ఇంత చల్లని రేయి ఇంత చక్కని హాయి
అంతయు తిలకించి సంతసించవే
అని యమున పిలిచింది రారమ్మని

ఇంత చల్లని రేయి ఇంత చక్కని హాయి

కెరటాల నురుగులో చిరుగాలి పరుగులో
కెరటాల నురుగులో చిరుగాలి పరుగులో
జలతారు వెన్నెలే జలదరించించి
జలతారు వెన్నెలే జలదరించించి
పూల పొదరిళ్ళ లో గాలి కౌగిళ్ళలో
పూల పొదరిళ్ళ లో గాలి కౌగిళ్ళలో
జాలమయి నీలమయి గగురు పొడిచింది

ఇంత చల్లని రేయి ఇంత చక్కని హాయి

సడిలేని నది రేయి జగమంత నిదురించే
శరదిందు కిరణాలు చలిచలిగ ప్రసరించే
శరదిందు కిరణాలు చలిచలిగ ప్రసరించే
ఇసుక తిన్నెల మీద పసిడి వెన్నెల లోన
ఇసుక తిన్నెల మీద పసిడి వెన్నెల లోన
రసరాజ రమణి రాసక్రీడకు పిలిచే

ఇంత చల్లని రేయి ఇంత చక్కని హాయి


~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఇక ఈ రోజు హాస్య గీతంగా శ్రీకృష్ణార్జున యుద్దం చిత్రంలోని ఒక సరదా పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శ్రీ  కృష్ణార్జున యుద్ధం (1963)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : పింగళి
గానం : బి.గోపాలం, స్వర్ణలత

సోహం.. సోహం.. సోహం.. సోహం..

అంచెలంచెలు లేని మోక్షము చాల కష్టమే భామినీ
కష్టమైనను ఇష్టమేనని కోరి నిలిచితి చినమునీ

అయిన కుదురుగ ఎదుట కూర్చుని గాలి గట్టిగా పీల్చుమా
స్వామీ స్వామీ... ఏమీ ఏమీ
నేను పీల్చిన గాలి నిలువక అకటా మీపై విసిరెనేఅకట మీపై విసిరినే అందుకే మరి...

అంచెలంచెలు లేని మోక్షము చాల కష్టమే భామినీ
కష్టమైనను ఇష్టమేనని కోరి నిలిచితి చినమునీ

కనులు మూసుకు చూపును ముక్కుకొనపై నిలుపుమా
స్వామీ స్వామీ...ఈ మారేమీ
అచట నిలువక చుపులన్నీ అయ్యో మీపై దూకెనేఅయ్యో మీపై దూకెనే అదే మరి...

అంచెలంచెలు లేని మోక్షము చాల కష్టమే భామినీ
కష్టమైనను ఇష్టమేనని కోరి నిలిచితి చినమునీ 
 
 

2 comments:

వేణూజీ..మీకు జన్మాష్టమి శుభాకాంక్షలు..

థాంక్స్ శాంతి గారూ... మీకు కూడా జన్మాష్టమి శుభాకాంక్షలు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.