మంగళవారం, ఆగస్టు 08, 2017

తియ్యన్ని దానిమ్మ...

నిరీక్షణ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నిరీక్షణ (1981)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆత్రేయ
గానం : బాలు, ఎస్.పి.శైలజ

తియ్యన్ని దానిమ్మ కొమ్మల్లోనంట
చిన్నారి పొన్నారి చిలకల్ల జంట
చేస్తున్న కమ్మని కాపురమూ
చూస్తున్న కన్నుల సంబరమూ
ప్రేమకు మందిరమూ

తియ్యన్ని దానిమ్మ కొమ్మల్లోనంట
చిన్నారి పొన్నారి చిలకల్ల జంట
చేస్తున్న కమ్మని కాపురమూ
చూస్తున్న కన్నుల సంబరమూ
ప్రేమకు మందిరమూ

తియ్యన్ని దానిమ్మ కొమ్మల్లోనంట
చిన్నారి పొన్నారి చిలకల్ల జంట

ఒకదేహం ఒకప్రాణం తమ స్నేహంగా
సమభావం సమభాగం తమ పొందుగా
చిలకమ్మ నెయ్యాలే ఉయ్యాలగా
చెలికాని సరసాలే జంపాలగా
అనురాగం ఆనందం అందాలుగా
అందాల స్వప్నాలే స్వర్గాలుగా
ఎడబాసి మనలేనీ హృదయాలుగా
ముడిపడ్డ ఆ జంట తొలిసారిగా
గూడల్లుకోగా పుల్లల్లుతేగా
చెలికాడు ఎటకో పోగా..
అయ్యో... పాపం..
వేచెను చిలకమ్మ

తియ్యన్ని దానిమ్మ కొమ్మల్లోనంట
చిన్నారి పొన్నారి చిలకల్ల జంట

ఒక వేటగాడెందో వలపన్నగా
తిరుగాడు రాచిలుక గమనించక
వలలోన పడి తాను అల్లాడగా
చిలకమ్మ చెలికాని సడికానక
కన్నీరు మున్నీరై విలపించగా
ఇన్నాళ్ళ కలలన్నీ కరిగించగా
ఎలుగెత్తి ప్రియురాలు రోదించగా
వినలేని ప్రియుడేమో తపియించగా
అడివంతా నాడు ఆజంట గోడు
వినలేక మూగైపోగా...
అయ్యో... పాపం...
వేచెను చిలకమ్మ

తియ్యన్ని దానిమ్మ కొమ్మల్లోనంట
చిన్నారి పొన్నారి చిలకల్ల జంట
చేస్తున్న కమ్మని కాపురమూ
చూస్తున్న కన్నుల సంబరమూ
ప్రేమకు మందిరమూ

తియ్యన్ని దానిమ్మ కొమ్మల్లోనంట
చిన్నారి పొన్నారి చిలకల్ల జంటా 
 


2 comments:

బుచికోయమ్మ బుచికి. ఏమి బాగుంది.

ఈ సినిమా కథ మొత్తాన్ని ఒక అందమైన పాటగా చెప్పారండీ ఇళయరాజాగారు ఆత్రేయ గారు కలిసి.. నాకు చాలా ఇష్టమీపాట.. సినిమా చూసిన వారికి మరింత నచ్చుతుంది.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail