శుక్రవారం, ఆగస్టు 04, 2017

శ్రీకరమగు పరిపాలన...

మహాకవి కాళిదాసు చిత్రంలోని ఓ అమ్మవారి పాటను ఈ శ్రావణ శుక్రవారంరోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మహాకవికాళిదాసు (1960)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : పింగళి నాగేంద్రరావు
గానం : పి.లీల, రత్నం బృందం

శ్రీకరమగు పరిపాలన నీదే జగదీశ్వరీ
లోకావన నిత్యవ్రతమీవే భువనేశ్వరీ
శ్రీకరమగు పరిపాలన నీదే జగదీశ్వరీ

నీ కృపా కటాక్షములే సకల శుభములొసగగా
నీ కృపా కటాక్షములే సకల శుభములొసగగా
ఇహ పరముల కాధారము మహాలక్ష్మి నీవేగా

శ్రీకరమగు పరిపాలన నీదే జగదీశ్వరీ

నీ వీణా నాదములో వేదములే పలుకగా
నీ వీణా నాదములో వేదములే పలుకగా
జటజగములు మేలు కొలుపు మహావాణి నీవెగా

శ్రీకరమగు పరిపాలన నీదే జగదీశ్వరీ

నీవిజయ విహారములే లోక రక్షలౌనుగా ఆఅ..
నీవిజయ విహారములే లోక రక్షలౌనుగా
అభయమొసగి భువనమేలు మహాకాళి నీవెగా

శ్రీకరమగు పరిపాలన నీదే జగదీశ్వరీ
లోకావన నిత్యవ్రతమీవే భువనేశ్వరీ
శ్రీకరమగు పరిపాలన నీదే జగదీశ్వరీ


0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.