ఆదివారం, జూన్ 04, 2017

రేవులోన చిరుగాలి...

పసుపు పారాణి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పసుపు పారాణి (1980)
సంగీతం : రమేశ్ నాయుడు
సాహిత్యం : దాసం గోపాలకృష్ణ
గానం : బాలు, సుశీల

రేవులోన చిరుగాలి రెక్కలార్చుకుంటోంది
ఆవులించి చిరు కెరటం ఒళ్ళు విరుచుకుంటోంది
రేవులోనా ..  చిరుగాలి రెక్కలార్చుకుంటోంది
ఆవులించీ .. చిరు కెరటం ఒళ్ళు విరుచుకుంటోంది

పడమటి కొండ పడుచు పసుపు చీర కట్టింది
పడమటి కొండ పడుచు పసుపు చీర కట్టింది
ఇసుక తిన్నెపై గవ్వలు నవ్వులెండ పెడుతున్నాయి

రేవులోన చిరుగాలి రెక్కలార్చుకుంటోంది
ఆవులించి చిరు కెరటం ఒళ్ళు విరుచుకుంటోంది

జడలోని గులాబీ చలి మంటలు వేస్తోంది
ఓహో..ఆఆఅ..ఆఆఆ...
జలతారు జిలుగు పైట చదరంగం ఆడుతోంది
లలలల లలల లలల హో...
జడలోని గులాబీ చలి మంటలు వేస్తోంది
జలతారు జిలుగు పైట చదరంగమాడుతోంది

జలదరించి పై పెదవి చలివెందర పెడుతోంది
బాజాలకు మాటిద్దామా...  బాసికాలు కట్టిద్దామా
బాజాలకు మాటిద్దామా...  బాసికాలు కట్టిద్దామా

రేవులోనా చిరుగాలి రెక్కలార్చుకుంటోంది
రెక్కలార్చుకుంటోంది
ఆవులించీ చిరు కెరటం ఒళ్ళు విరుచుకుంటోంది
ఒళ్ళు విరుచుకుంటోంది

ఈ కళ్ళతో ఆ కళ్ళు గస్తీలు కాస్తున్నాయి
ఓహో..అఆఅ...ఆఆ...ఆఅ
ఆ రూపుతో ఈ రూపులు విస్తళ్ళు వేస్తున్నాయి
లలలలల్ లలల లలల అహాహ హ..
ఆ కళ్ళతో ఈ కళ్ళు గస్తీలు కాస్తున్నయ్
ఆ రూపుతో ఈ రూపులు విస్తళ్ళు వేస్తున్నయ్

మురిపించే ఆ పలుకులు స్వస్తి పలుకుతున్నాయి
తోరణాలు కట్టిద్దామా... తొలివలపులు పండిద్దామా
తోరణాలు కట్టిద్దామా...  తొలివలపులు పండిద్దామా

రేవులోనా  చిరుగాలి రెక్కలార్చుకుంటోంది
రెక్కలార్చుకుంటుంది
ఆవులించీ చిరు కెరటం ఒళ్ళు విరుచుకుంటోంది
ఒళ్ళు విరుచుకుంటోంది
రేవులోన చిరుగాలి రెక్కలార్చుకుంటోంది
ఆవులించి చిరు కెరటం ఒళ్ళు విరుచుకుంటోంది

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.