గురువారం, మే 18, 2017

గున్నమామిడీ కొమ్మమీద...

బాలమిత్రుల కథ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : బాలమిత్రుల కథ (1973)
సంగీతం : సత్యం
సాహిత్యం : సినారె
గానం : జానకి

గున్నమామిడీ కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
గున్నమామిడీ కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలకుంది...
ఒక గూటిలోన కోయిలుంది...

గున్నమామిడీ కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి

చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది
అయిన ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది
చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది
అయిన ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది
పొద్దున చిలకను చుడందే
ముదు ముద్దుగ ముచ్చటలాడందే
పొద్దున చిలకను చుడందే
ముదు ముద్దుగ ముచ్చటలాడందే
చిగురులు ముట్టదు చిన్నారి కోయిల
చిలక ఊగధు కొమ్మ ఊయల...

గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలుకుంది ఒక గూటిలోన కోయిలుంది
గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి

ఒక పలుకే పలుకుతాయి ఒక జట్టుగ తిరుగుతాయి
ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి
ఒక పలుకే పలుకుతాయి ఒక జట్టుగ తిరుగుతాయి
ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి
రంగు రూపు వేరైన జాతి రీతి వేరైన
రంగు రూపు వేరైన తమ జాతి రీతి వేరైన
చిలక కోయిల చేసిన చెలిమి
ముందు తరాలకు తరగని కలిమి...

గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలుకుంది ఒక గూటిలోన కోయిలుంది
గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి
గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి
గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి

 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.