ఆదివారం, మే 14, 2017

ఎక్కడ ఎక్కడ దాక్కున్నానో...

మాత్రుమూర్తులందరకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు అందజేస్తూ ఈ రోజు జీవన జ్యోతి సినిమాలోని ఈ చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : జీవన జ్యోతి (1975)
సంగీతం : కె.వి. మహదేవన్ 
సాహిత్యం : సినారె
గానం : సుశీల, వసంత

అమ్మా...అమ్మా
ఎక్కడ ఎక్కడ దాక్కున్నానో చెప్పుకో..
ఇక్కడ వెతికీ అక్కడ వెతికీ పట్టుకో
ఎక్కడ ఎక్కడ దాక్కున్నానో చెప్పుకో..
ఇక్కడ వెతికీ అక్కడ వెతికీ పట్టుకో
లారలల్ల లారలల్ల లారలల్ల లారలల్ల ..
అమ్మా...  అమ్మా

వస్తున్నాను ఇదిగో వస్తున్నాను..
నా చిన్నారి బాబు కోసం వస్తున్నాను
వస్తున్నాను ఇదిగో వస్తున్నాను..
నా చిన్నారి బాబు కోసం వస్తున్నాను


రా రా రా అమ్మా రాముని కథలూ చెప్పమ్మా..
ఊ ఊ ఊ ఊ ఊకొడుతూ వింటానమ్మా
రా రా రా అమ్మా రాముని కథలూ చెప్పమ్మా..
ఊ ఊ ఊ ఊ ఊకొడుతూ వింటానమ్మా

చెబుతాను రా.. బాబు..
ఆ చిరంజీవి కథ నీకు చెబుతానురా
చెబుతాను రా.. బాబు..
ఆ చిరంజీవి కథ నీకు చెబుతానురా
బాబూ.. బాబూ.. బాబూ

లారలల్ల లారలల్ల లారలల్ల లారలల్ల..  
అమ్మా..  అమ్మా

తాతయ్యనడిగి తాయిలమొకటి తెచ్చాను..
తాతయ్యనడిగి తాయిలమొకటి తెచ్చాను
అది కాకెంగిలి చేసిస్తే కాస్తా
నువ్వు తింటావా అమ్మా తింటావా
నా బంగారు నాన్నా ఎంగిలి అయినా
అదే అమృతమనుకుంటానురా
నా బంగారు నాన్నా ఎంగిలి అయినా
అదే అమృతమనుకుంటానురా..
అదే అమృతమనుకుంటానురా

లారలల్ల లారలల్ల లారలల్ల లారలల్ల..  
అమ్మా..  అమ్మా

ఆకాశంలో దాక్కుంటే అక్కడికెట్లా వస్తావు..
భూమి లోపల నక్కుంటే ఏట్లా పట్టుకుంటావు
ఆకాశంలో దాక్కుంటే అక్కడికెట్లా వస్తావు..
భూమి లోపల నక్కుంటే ఏట్లా పట్టుకుంటావు

తారల నడిగీ భూదేవి నడిగి..
తారల నడిగీ భూదేవి నడిగి..
నీ జాడ తెలుసుకుంటానురా..
నిన్ను నా గుండెలో దాచుకుంటాను రా..
నా గుండెలో దాచుకుంటాను రా
 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.