గురువారం, జనవరి 19, 2017

యూ అండ్ మీ...

ఖైదీ నంబర్ 150 చిత్రంలోని ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ ఆవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఖైదీ నంబర్ 150 (2017)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : హరిహరన్, శ్రేయఘోషల్
  
మీమీ మిమ్మీమీ 
ఇకపై ఓన్లీ యూ అండ్ మీ

సాయంకాలానా సాగర తీరానా
సంధ్య సూర్యుడిలా నువ్వూ నేను
వేసవి కాలానా వెన్నెల సమయానా
తార చంద్రుడిలా నువ్వూ నేను
నువ్వు రాగం అయితే నే పాటవుతాను
నువ్వు మేఘం అయితే
నీ జిలిబిలి వలపుల వర్షం నేను
మీమీ మిమ్మీమీ 
ఇకపై ఓన్లీ యూ అండ్ మీ
 మీమీ మిమ్మీమీ 
ఇకపై ఓన్లీ యూ అండ్ మీ
సాయంకాలానా సాగర తీరానా
సంధ్య సూర్యుడిలా నువ్వూ నేను
వేసవి కాలానా వెన్నెల సమయానా
తార చంద్రుడిలా నువ్వూ నేను

ముద్ద మందారం తెలుసు
మెరిసే  బంగారం  తెలుసు
రెండు కలిపేస్తే నువ్వేనా
మండే  సూర్యుడు తెలుసు
వెండి జాబిల్లి తెలుసు
రెండు కలబోస్తే నువ్వేనా
రోజు అద్దంలో అందం నువ్వేనా
ఆ అందం నువ్వుయితే నువ్వూ నేనా
రోజు కన్నుల్లో కలలే నువ్వేనా
కలలే నిజమైతే నువ్వూ నేనా

మీమీ మిమ్మీమీ 
ఇకపై ఓన్లీ యూ అండ్ మీ
మీమీ మిమ్మీమీ 
ఇకపై ఓన్లీ యూ అండ్ మీ

కోపం సైనికుడి వరస
తాపం ప్రేమికుడి వరస
రెండూ ఒకటైతే నువ్వేనా
పల్లె  పడుచుల్ని చూసా
పట్నం సొగసుల్ని చూసా
రెండూ ఒకటైతే నువ్వేనా
రంగుల విల్లంటే అచ్చం నువ్వేనా
బాణం నేనైతే నువ్వూ నేనా
పువ్వుల వరదంటే అచ్చం నువ్వేనా
నన్నే చుట్టేస్తే నువ్వూ నేనా

మీమీ మిమ్మీమీ 
ఇకపై ఓన్లీ యూ అండ్ మీ
మీమీ మిమ్మీమీ 
ఇకపై ఓన్లీ యూ అండ్ మీ



0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.