మంగళవారం, జనవరి 10, 2017

గోవింద మాధవ దామోదరా...

సీతారామ కళ్యాణం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్లు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సీతారామ కల్యాణం (1961)
సంగీతం : గాలి పెంచలనరసింహారావు
రచన : సముద్రాల రాఘవాచార్య
గానం :ఘంటసాల వెంకటేశ్వరరావు

గోవింద మాధవ దామోదరా
జయ గోవింద మాధవ దామోదరా,
జగదానంద కారణ నారాయణా
జయ గోవింద మాధవ దామోదరా

కృతులు హరించీ జలనిధి దాగిన
కృతులు హరించీ జలనిధి దాగిన
సోమక దానవు ద్రుంచీ.... 
వేదోద్ధరణము చేసిన వీరా..
మీనాకార శరీరా నమో మీనాకార శరీరా

పాల సముద్రము బానగ జేసి
పాల సముద్రము బానగ జేసి
మందర శైలము కవ్వము జేసి
వాసుకి కవ్వపు త్రాటిని జేసి
వాసుకి కవ్వపు త్రాటిని జేసి
సురదానవులు తఱచగా
గిరిని మోసిన కూర్మ శరీరా నమో
గిరిని మూపున మోసిన కూర్మ శరీరా

పుడమిని బట్టి చాపగా జుట్టి
పుడమిని బట్టి చాపగా జుట్టి
కడలిని దాగిన హిరణ్యాక్షుని
కోరను గొట్టీ ధారుణి గాచిన
వీర వరాహ శరీరా నమో వీర వరాహ శరీరా

సర్వమయుడవగు నిను నిందించే
సర్వమయుడవగు నిను నిందించే
హిరణ్య కశిపుని హిరణ్య కశిపుని వధియించీ
ప్రహ్లాదుని పరిపాలన జేసిన నరసింహాద్భుత రూపా
నమో నరసింహాద్భుత రూపా

సురలబ్రోవ మూడడుగుల నేల
సురలబ్రోవ మూడడుగుల నేల
బలిని వేడి ఆ..ఆ..ఆ.. బలిని వేడి
ఇల నింగిని నిండీ
మూడవ పాదము బలి తలమోపిన
వామన విప్ర కుమారా
నమో! వామన విప్ర కుమారా

ధరణీ నాధుల శిరముల గొట్టీ
ధరణీ నాధుల శిరముల గొట్టీ
సురలోకానికి నిచ్చెనగట్టీ,
తండ్రికి రుధిరము తర్పణ జేసిన
పరశుధరా భృగురామా!
నమో పరశుధరా భృగురామా!

గోవింద మాధవ దామోదరా
జయ గోవింద మాధవ దామోదరా
జగదానంద కారణ నారాయణా
గోవింద మాధవ దామోదరా


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.