గురువారం, డిసెంబర్ 22, 2016

మాధవా మానిని చిత్తచోరా..

దొంగల్లోదొర చిత్రంలోని ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : దొంగల్లో దొర (1957)
సంగీతం : సుబ్రహ్మణ్యరాజు ఎమ్.
సాహిత్యం : మల్లాది
గానం : పి.లీల

మాధవా..ఆఅ..ఆ మానిని చిత్త చోరా
గోకులానంద బాలా నన్నేలరా..

మనమోహనా నవ మదనా
మనమోహనా నవ మదనా
మనసీయరా నీదానా
మనసీయరా నీదానా
మనమోహనా నవ మదనా
మనసీయరా నీదానా
మనమోహనా..

చనువైన స్వామీ దరిచేర రావేరా
చనువైనా స్వామీ..
చనువైన స్వామీ దరిచేర రావేరా
నెనరైన నా మనసూ..
నెనరైన నా మనసూ నీదే...

మనమోహనా నవ మదనా
మనసీయరా నీదానా
మనమోహనా..

బృందావన వీధుల సరసాలతో
మురిపించు మనోహర
వేగమునేలగరా.. నీ సరి జాణనురా..
నిన్నిక విడువనురా..

మనమోహనా నవ మదనా
మనమోహనా..
 
మైమరపించు జాణనురా
సయ్యాటాకాడ సరసాలా తేలేమురా
మధురానంద గీతిని నేనేరా
మురళీలోల జాగేలరా.. సయ్యాటలాడ
మనసైన లలననురా
నను పాలించ పరువౌనురా స్వామి
ఈ రేయి మనదౌనురా..
నను పాలించ పరువౌనురా స్వామి
ఈ రేయి మనదౌనురా..
తొలిప్రాయంబు దోచిన దొరవవురా..

మైమరపించు జాణనురా
సయ్యాటాకాడ సరసాలా తేలేమురా

మైమరపించు జాణనురా
సయ్యాటాకాడ సరసాలా తేలేమురా 

 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.