బుధవారం, డిసెంబర్ 21, 2016

భజరే నంద గోపాల హరే...

త్వరలో విడుదలవనున్న ద్వారక చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు. ఎంబెడ్ చేసినది ఈ పాట టీజర్, అది లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు. పూర్తిపాట ఆడియో యూట్యూబ్ లో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ద్వారక (2016)
సంగీతం : సాయి కార్తీక్
సాహిత్యం : శ్రీ సాయి కిరణ్
గానం : చిత్ర

భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే

భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే

మురళీ గాన లోల దూరమేల దిగి రా కృష్ణా
కడలై పొంగుతున్న ప్రేమ లీల కన రా కృష్ణా
అందుకో సంబరాల స్వాగతాల మాలిక
ఇదిగో నిన్ను చూసి వెలుగుతున్న ద్వారకా...ఆఅ..

భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే

మా ఎద మాటున దాగిన ఆశలు
వెన్నెల విందనుకో
మా కన్నుల కందని మాయని
చూపుతూ మెల్లగా దోచుకుపో
గిరినే వేలిపైన నిలిపిన మా కన్నయ్య
తులసీ దళానికే ఏల తూగినావయ్యా
కొండంత భారము గోరంత చూపిన లీలా కృష్ణయ్యా
మా చీరలు దోచిన అల్లరి ఆటలు మాపైన ఏం మాయా..ఆఅ.

భజరే భజరే భజరే.. భజ.. భజ..
భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే

మాయవి కావని మాధవుడా నిను చేరిన ప్రాణమిది
మా మాయని బాధని పిల్లన గ్రోవిన రాగము చేయమని
ఎవరిని ఎవరితోటి ముడి పెడుతూ నీ ఆట
చివరికి ప్రతి ఒకరిని నడిపెదవుగ నీ బాట

తీరని వేదన తియ్యని లాలన అన్నీ నీవయ్యా
నీ అందెల మువ్వల సవ్వడి 
గుండెలో మోగించ రావయ్యా..ఆఅ.

భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే

భజరే నంద గోపాల హరే

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.