బుధవారం, డిసెంబర్ 14, 2016

ఆలయాన హారతిలో...

సుస్వాగతం చిత్రంలోని ఒక మంచి పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సుస్వాగతం (1998)
సంగీతం : S.A.రాజ్ కుమార్
సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : బాలు

ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం

ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం
దీపాన్ని చూపెడుతుందో తాపాన బలిపెడుతుందో
అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం
ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం

ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం

ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా
గుండె బావిలో ఉన్న ఆశ తడి ఆవిరి అవుతున్నా
ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమా
ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకి ఇవ్వమ్మా
నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం
యదర ఉంది నడిరేయన్నది ఈ సంధ్యా సమయం
ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం

ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం

సూర్యబింబమే అస్తమించనిదె మేలుకోని కల కోసం
కళ్ళు మూసుకొని కలవరించెనే కంటిపాప పాపం
ఆయువిచ్చి పెంచిన బంధం మౌనంలో మసి అయినా
రేయిచాటు స్వప్నం కోసం ఆలాపన ఆగేనా
పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా
కంటిపాప కల అడిగిందని నిదురించెను నయనం
ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం

ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం
దీపాన్ని చూపెడుతుందో తాపాన బలిపెడుతుందో
అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం
ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.