ఆదివారం, డిసెంబర్ 11, 2016

ఎదుటా నీవే యదలోనా నీవే...

అభినందన చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అభినందన (1988)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు

ఎదుటా నీవే యదలోనా నీవే
ఎదుటా నీవే యదలోనా నీవే
ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే
ఎదుటా నీవే యదలోనా నీవే

మరుపే తెలియని నా హృదయం
తెలిసి వలచుట తొలి నేరం అందుకే ఈ గాయం
మరుపే తెలియని నా హృదయం
తెలిసి వలచుట తొలి నేరం అందుకే ఈ గాయం

గాయాన్నైనా మాననీవు హృదయాన్నైనా వీడిపోవు
కాలం నాకు సాయం రాదు మరణం నన్ను చేరనీదు
పిచ్చి వాడ్ని కానీదు ఆహహా ఓహోహో
ఊఁహుఁహుఁ ఊఁహూఁహూ...

ఎదుటా నీవే యదలోనా నీవే
ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే
ఎదుటా నీవే యదలోనా నీవే

కలలకు భయపడి పోయాను
నిదురకు దూరం అయ్యాను వేదన పడ్డాను
నిదురకు దూరం అయ్యాను వేదన పడ్డాను
స్వప్నాలైతే క్షణికాలేగా సత్యాలన్నీ నరకాలేగా
స్వప్నం సత్యం ఐతే వింత సత్యం స్వప్నం అయ్యేదుందా
ప్రేమకింత బలముందా ఆహహా ఓహోహో
ఊఁహుఁహుఁ ఊఁహూఁహూ...

ఎదుటా నీవే యదలోనా నీవే
ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే
ఎదుటా నీవే యదలోనా నీవే

 

2 comments:

సాంగ్ మధ్యలో బీజియంస్ వేరైనా ఈ రెండు పాటలూ ఒకేలా ఉంటాయి..రెండూ డైరెక్ట్ తెలుగూ మూవీసే..ఇళయరాజా గారే మ్యూజిక్ అవడం, రెండిటి లో మురళియే(కార్తీక్) హీరో అవడం.. నాకెప్పుడూ ఆశ్చర్యం గా ఉంటుందండి..
https://www.youtube.com/watch?v=DWeXu18ISYE

థాంక్స్ శాంతి గారు... అవునండీ ఎవరి ఐడియానో కానీ రాజా గారు భలె వాడారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.