శనివారం, నవంబర్ 05, 2016

వెన్నెల దీపం వెలుగాయె...

అహనాపెళ్ళంట చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అహనాపెళ్ళంట (2011)
సంగీతం : రఘు కుంచె
సాహిత్యం : సిరాశ్రీ
గానం : రఘుకుంచె

వెన్నెల దీపం వెలుగాయె నాకోసమే 
చీకటి దుప్పటి తొలగించే ఆకాశమే 
చల్లని వేళా నా కన్నులు నిదరోయెలే 
నిద్దురలోనే ఏదేదో కలవరమాయెలే
కనివిని ఎరుగని కలయికే అయినదీ 
పరిమళం విరిసెనే అతిశయం కాదిది 

నువ్వే కావాలి తోడుగా 
నాతో ఉండాలి నీడగా
నువ్వే కావాలి తోడుగా 
నాతో ఉండాలి నీడగా 
ఏమిటో కలవరం హాయిలే ఈ వరం 
ఎందుకో పరవశం తాకెనే అంబరం 

ఏవేవొ అనుకుంటున్నా 
ఎన్నెన్నొ కలగంటున్నా 
నీ తలపులోనే ఉంటున్నా.. 
నీ తలపులోనే ఉంటున్నా.. 
మది రాగమే వింటున్నా 
కను తెరిచి కలగంటున్నా 
ఇది వింత సుఖమే అంటున్నా 
ఇది వింత సుఖమే అంటున్నా
ఆ మురళి రవళిలో సరిగమలా 
ఆనంద కడలిలో తొలి అలలా
అరవిచ్చుకున్న ఓ పూవనిలా 
ఆ నింగినున్న చిరు తారకలా 
నీ చెలిమి కనిపిస్తూ ఉందీ.. 
అని నాకు అనిపిస్తూ ఉందీ.. 

నువ్వే కావాలి తోడుగా 
నాతో ఉండాలి నీడగా 

 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.