గురువారం, అక్టోబర్ 06, 2016

దేవీ దుర్గా దేవీ...

లలితా త్రిపుర సుందర దేవి అవతారంలో దర్శనమీయనున్న అమ్మవారికి నమస్కరించుకుంటూ ఈ రోజు సంకీర్తన సినిమాలోని ఒక చక్కని పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సంకీర్తన
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సినారె
గానం : బాలు, వాణీ జయరాం

దేవీ దుర్గాదేవీ.. దేవీ దుర్గాదేవీ
ఆంగికం వాచికం అన్ని నీవే 
అఖిలాత్మ నీవే.. అఖిలాత్మ నీవే
ఆంగికం వాచికం అన్ని నీవే 
అఖిలాత్మ నీవే.. అఖిలాత్మ నీవే
దేవీ దుర్గాదేవీ.. దేవీ దుర్గాదేవీ దేవీ

కాల భయకర శూలి ప్రియకర మూల మాతృకవే
రాగ సుందర రౌద్ర భందుర యోగలోచనివే
కాల భయకర శూలి ప్రియకర మూల మాతృకవే
రాగ సుందర రౌద్ర భందుర యోగలోచనివే
జరుపవేమి మనుజ మహిష మర్ధన
నెరపవేమి సామ్య ధర్మ రక్షణ
జరుపవేమి మనుజ మహిష మర్ధన
నెరపవేమి సామ్య ధర్మ రక్షణ
తాప వారిణి పాప హారిణి
అనంత దిగంత దృగంత చారిణి.. దేవీ..

దేవీ కవితాదేవీ..దేవీ కవితాదేవీ..
ధ్యానమూ, గానమూ అన్ని నీవే 
నన్నంటి రావే.. నన్నంటి రావే
ధ్యానమూ, గానమూ అన్ని నీవే
నన్నంటి రావే.. నన్నంటి రావే
దేవీ కవితాదేవీ.. దేవీ..
 
పా రిపమని పాప మపని సాస పనిస రీరి.. 
వాలుకనుగవలోనా మరుని ఆన విరుల వాన
రిగారిస రిగారిస రిసస్స రిరి పనిప పానిప మపప..
సంచాలిత సంచారిత పదాలు 
సాందీకృత చాంద్రీమయ నదాలు
రిసమరి గరి రిసమరి పమ రిగరి  
అనితరములు అభినయ విలాసములు
రిసమరి పమ నిప మరిగరిరి సమ 
రిపమనిప సనిప మపమ రిగరి 
రిసమరి పమ నిప మరిరిరి సమ 
రిపమనిప సనిప మపమ రిగరి 
సరిమ రిమప మపని గనిసరీ
నిసరి సరిమ రిమప మపనిసా  

పాల నవ్వులలోన భావన పైట సవరించే 
తీగ నడుమున సోగ బిడియము తూగి నటియించే
పాల నవ్వులలోన భావన పైట సవరించే
తీగ నడుమున సోగ బిడియము తూగి నటియించే
అందుకుంటే తీపి బెదురు అల్లన
అందకుంటే గుండె గుబురు జల్లన
అందుకుంటే తీపి బెదురు అల్లన
అందకుంటే గుండె గుబురు జల్లన
ఎంత విరహం ఎంత మధురం
వెన్నెల్లో దూపాలు కళ్ళల్లో దీపాలు

దేవీ దుర్గాదేవీ.. దేవీ దుర్గా దేవీ.. 
ఆంగికం వాచికం అన్ని నీవే 
అఖిలాత్మ నీవే.. అఖిలాత్మ నీవే
దేవీ దుర్గాదేవీ.. దేవీ దుర్గాదేవీ దేవీ


2 comments:

ఓం ఐం హ్రీం శ్రీం..శ్రీమాత్రే నమహ..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.