బుధవారం, ఆగస్టు 03, 2016

పిలచినా బిగువటరా...

మల్లీశ్వరి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : మల్లీశ్వరి (1951)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : దేవులపల్లి
గానం : భానుమతి

పిలచిన బిగువటరా..  ఔరౌరా
పిలచినా.. బిగువటరా.. ఔరౌరా
పిలచినా.. బిగువటరా.. ఔరౌరా

చెలువలు తామే వలచి వచ్చిన..
పిలచినా బిగువటరా.. ఔరౌరా
చెలువలు తామే వలచి వచ్చిన
పిలచినా బిగువటరా..
భళిరా రాజా..

ఈ నయగారము ఈ వయ్యారము
ఈ నయగారము ఈ వయ్యారము
ఈ నవ యవ్వనమానగ నిను నే
పిలచినా బిగువటరా...
ఈ నయగారము ఈ వయ్యారము
ఈ నవ యవ్వనమానగ నినునే

పిలచినా.. బిగువటరా

గాలుల తేలెడు గాఢపు  మమతలు
గాలుల తేలెడు గాఢపు  మమతలు
నీలపు మబ్బుల నీడలు కదలెను

అందెల రవళుల సందడి మరిమరి
అందెల రవళులా.. ఆ.. ఆ.. ఆ..
అందెల రవళుల సందడి మరిమరి
అందగాడా ఇటు తొందర చేయగా
అందగాడా ఇటు తొందర చేయగా
 
పిలచినా.. బిగువటరా ఔరౌరా..
పిలచినా.. బిగువటరా

 

6 comments:

మల్లీశ్వరిలో అన్ని పాటలూ ఆణిముత్యాలే..

అవును శాంతి గారు అన్ని పాటలూ బాగుంటాయ్... థాంక్స్ ఫర్ ద కామెంట్..

పిలచినా బిగువటరా (పిలిచినా కాదు)

యమ్కె శర్మ

థాంక్స్ శర్మ గారు.. పోస్ట్ లో సరిచేశానండీ..

గొప్పపాటను పునఃపరిచయం చేసారండీ. సంతోషం.
టపా చివర్లో వేసిన బొమ్మ అనవసరం అని నా అభిప్రాయం.
ఈ పిలచిన బిగువటరా అన్న పాటను సాలూరి వారు కాఫీ రాగంలో స్వరపరిచారు. వీలైనంతవరకు రాగతాళాలు (తెలిస్తే) ఉటంకించండి మిగిలిన వివరాలతో పాటుగా.
వీలైనంతవరకూ పూర్తిపేర్లు వ్రాయటం ఉపయోగంగా ఉంటుంది. ఈ కాలం వాళ్ళలో కొందరికి సాలూరి అంటేనూ S.రాజేశ్వరరావు అంటే ఒకే సంగీతదర్శకుడని తెలియకపోవచ్చును. అలాగే దేవులపల్లి కృష్ణశాస్త్రి అంటేనే మరింత సదుపాయం వాళ్ళకి.

థాంక్స్ శ్యామలీయం గారు.. రాగ తాళాల గురించి నాకేమాత్రమూ తెలియదండీ.. పేర్ల విషయంలో మీరన్నది నిజమే.. ఇకపై పూర్తి పేర్లను ఇస్తాను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.