ఆదివారం, ఆగస్టు 28, 2016

పల్లకివై ఓహోం ఓహోం...

పౌర్ణమి చిత్రం కోసం దేవీశ్రీప్రసాద్ స్వరపరచిన ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేడా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ యూట్యూబ్ వీడియో లోడ్ అవని వాళ్ళు వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పౌర్ణమి (2006)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : గోపికాపూర్ణిమ

పల్లకివై ఓహోం ఓహోం 
భారాన్ని మొయ్ ఓహోం ఓహోం
పాదం నువ్వై ఓహోం ఓహోం 
నడిపించవోయ్ ఓహోం ఓహోం
అవ్వా బువ్వా కావాలోయ్ నువ్వే ఇవ్వాలోయ్
రివ్వు రివ్వున ఎగరాలోయ్ గాలిలో
తొక్కుడు బిళ్లాటాడాలోయ్ నీలాకాశంలో
చుక్కల్లోకం చూడాలోయ్ చలో చలో
చలో చలో ఓ ఓ… చలో ఓ ఓ ఓ…

హే కలవరపరిచే కలవో శిలలను మలిచే కళవో
అలజడి చేసే అలవో అలరించే అల్లరివో
ఒడుపుగ వేసే వలవో నడి వేసవిలో చలివో
తెలియదుగా ఎవరివో నాకెందుకు తగిలావో
వదలనంటావు ఒంటరిగా సరే పద మహాప్రభో
నిదర లేపాక తుంటరిగా 
ఇటో అటో ఎటో దూసుకుపోవాలోయ్

పల్లకివై ఓహోం ఓహోం 
భారాన్ని మొయ్ ఓహోం ఓహోం

హోయ్..జల జల జలపాతంలో జిలిబిలి చెలగాటంలో
గల గల గల సందడితో నా వంతెన కట్టాలోయ్
చిలకల కల గీతంలో తొలి తొలి గిలిగింతలలో
కిల కిల కిల సవ్వడితో కేరింతలు కొట్టాలోయ్
వదలనంటావు ఒంటరిగా సరే పద మహాప్రభో
నిదర లేపాక తుంటరిగా 
ఇటో అటో ఎటో దూసుకుపోవాలోయ్

పల్లకివై ఓహోం ఓహోం 

 

2 comments:

చల్లటి వర్షం లో మిర్చి బజ్జీలు తింటూ పాటలు వింటే భలే ఉంటుంది కదండీ..

వర్షం మిర్చిబజ్జీలు అంటే ఇక తిరుగేముందండీ :-) థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.