సోమవారం, ఆగస్టు 01, 2016

ఇది మేఘసందేశమో..

ఏడంతస్థుల మేడ చిత్రం కోసం చక్రవర్తి గారు స్వరపరచిన ఒక అందమైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కొవచ్చు.


చిత్రం : ఏడంతస్థుల మేడ (1980)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు, సుశీల

ఇది మేఘసందేశమో.. అనురాగ సంకేతమో 
ఆఆ..ఇది మేఘసందేశమో.. అనురాగ సంకేతమో

చిరుజల్లు కురిసింది వినువీధిలో
చిరుజల్లు కురిసింది వినువీధిలో
హరివిల్లు విరిసింది తొలిప్రేమలో

ఇది మేఘసందేశమో.. అనురాగ సంకేతమో

ఆహ హ హా ఆ ఆ ఆ
ఆహ హ హా ఆ ఆ ఆ

వెల్లువలా పొంగే నా పాల వయసు
పల్లవి పాడెను నా మూగ మనసు
వెల్లువలా పొంగే నా పాల వయసు
ఆ ఆ ఆ పల్లవి పాడెను నా మూగ మనసు
నీ పాట నా పాట కావాలని
ఆ నింగి ఈ నేల కావాలని
చినుకులు వేశాయి ఒక వంతెన
చినుకులు వేశాయి ఒక వంతెన

కలిసిన హృదయాలకది దీవెన

ఇది మేఘసందేశమో.. అనురాగ సంకేతమో

తడిసిన తనువేదో కోరింది స్నేహం
కలిగెను జడివానలో నాకు దాహం
తడిసిన తనువేదో కోరింది స్నేహం
ఆఆ కలిగెను జడివానలో నాకు దాహం
నీ చెంతలో నేను మరవాలనీ
నీ కంటిలో పాప కావాలని
వలపులు చేసాయి వాగ్దానము
హాఅ.. వలపులు చేసాయి వాగ్దానము
మనకివి సిరులింక కలకాలము
 
ఇది మేఘసందేశమో.. అనురాగ సంకేతమో

చిరుజల్లు కురిసింది వినువీధిలో
చిరుజల్లు కురిసింది వినువీధిలో
హరివిల్లు విరిసింది తొలిప్రేమలో

ఇది మేఘసందేశమో.. అనురాగ సంకేతమో

2 comments:

వన్ ఆఫ్ ద డీసెంట్ యెండ్ మెలోడియస్ రైన్ సాంగ్స్..

అవును శాంతి గారు మంచి మెలోడియస్ సాంగ్.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.