సోమవారం, జులై 18, 2016

అల్లిబిల్లి కలలా రావే...

వంశీ ఇళయరాజాల కాంబినేషన్ లో వచ్చిన ఓ మధుర గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : చెట్టు కింద ప్లీడరు (1989)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : బాలు, చిత్ర

అల్లిబిల్లి కలలా రావే
అల్లుకున్న కధలా రావే
అల్లిబిల్లి కలలా రావే
అల్లుకున్న కధలా రావే
మల్లెపూల చినుకై రావే
పల్లవించు పలుకై రావే
వేచే ఎదలో వెలుగై రావే

అల్లిబిల్లి కలలా రానా... ఆహ
అల్లుకున్న కధలా రానా... ఆహ
మల్లెపూల చినుకై రానా
పల్లవించు పలుకై రానా
వేచే ఎదలో వెలుగై రానా

అల్లిబిల్లి కలలా రావే... ఆహ
అల్లుకున్న కధలా రావే.... ఆహ
అల్లిబిల్లి కలలా...

సోగకళ్ళ విరిసే సొగసే గోగుపూలు కురిసే
రాగమైన పిలుపే తెలిపే మూగగుండె వలపే
రెప్పచాటు చూపే నేడు రెక్కలొచ్చి ఎగిసే
నిన్న కన్న కలలే నేడు నిన్నుకోరి నిలిచే
ఏల బిగువా ఏలుకొనవా ప్రేమకధ వినవా

అల్లిబిల్లి కలలా రానా... ఆహ
అల్లుకున్న కధలా రానా... ఆహ
అల్లిబిల్లి కలలా

ఆ ఆ ఆ...

జావళీలు పాడే జాణ జాబిలమ్మ తానై
గుండె నిండి పోయే చానా వెండి మబ్బు తానై
సంగతేదొ తెలిపే తలపే సంగతులు పలికే
దూరమింక చెరిపే వలపే దోరనవ్వు చిలికే
మేనికులుకే తేనెచినుకై పూల జల్లు కురిసే

అల్లిబిల్లి కలలా రావే... ఆహ
అల్లుకున్న కధలా రావే... ఆహ
అల్లిబిల్లి కలలా రానా...
అల్లుకున్న కధలా రానా... ఆహ
మల్లెపూల చినుకై రావే
పల్లవించు పలుకై రావే
వేచే ఎదలో వెలుగై రానా

అల్లిబిల్లి కలలా రావే
అల్లుకున్న కధలా రానా
అల్లిబిల్లి కలలా...

 

8 comments:

Wow - my favorite - VVIB - combination song!

వంశీ..ఇళయరాజా గారి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి పాటా ఓ దృశ్య కావ్యమే..

అవును శాంతి గారు వారి కాంబినేషన్ ఓ అద్భుతమ్.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

థాంక్స్ అజ్ఞాత గారు..

నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మ దినం సందర్భముగా ఈ పాటని ఈ రోజు(19 జులై ) ప్రచురించి ఉంటే మరింత శోభాయమానంగా ఉండేది.... ఏది ఏమైనా .... అద్భుతమైన పాట అందించినందుకు ధన్యవాదములు.

థాంక్స్ విద్యాసాగర్ గారు.. నేను పండగలకే తప్ప ఇలా సెలబ్రిటీల బర్త్ డేలకి స్పెషల్ సాంగ్స్ వేయడం లేదండీ.. అందుకే ఆలోచన రాలేదు.

ఈ పాట రాసింది వెన్నెలకంటి గారు అనుకుంటా, వేటూరి కాదు. ఈ చిత్రానికి వేటూరి పాటలు రాయలేదు - సిరివెన్నెల, వెన్నెలకంటి & జొన్నవిత్తుల రాశారు.

వికీ వెన్నెలకంటి గారి పేరు చూపిస్తుందండీ.. ప్రస్తుతానికి దాన్ని ఫాలో అయిపోతున్నాను. థాంక్స్ ఫర్ ద కామెంట్ ఫణీంద్ర గారు :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.