ఆదివారం, జులై 17, 2016

దేవత ఓ దేవత...

రామజొగయ్య శాస్త్రి గారు రాసిన ఓ చక్కని ప్రేమ గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : పోటుగాడు
సంగీతం : అచ్చు
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : కార్తిక్

ఇది వరకిటువైపుగా రాలేదుగా నా కల
చేజారినదేమిటో తెలిసిందిగా ఈ వేళ
చిమ్మ చీకటి నిన్నలో దాగింది నా వెన్నెల
మరు జన్మము పొందేలా సరికొత్తగా పుట్టానే మరల

దేవత ఓ దేవత
నా మనసునే మార్చావే
ప్రేమతో నీ ప్రేమతో నను మనిషిగా మలిచావే
దేవత ఓ దేవత
నా మనసునే మార్చావే
ప్రేమతో నీ ప్రేమతో నను మనిషిగా మలిచావే
ఓ......ఓ......ఓ...

ఓహో..హో..హో...హో
నా గుండే కదలికలో వినిపించే స్వరము నువే
నే వేసే అడుగు నువే నడిపించే వెలుగు నువే
నా నిన్నలనే మరిపించేలా మాయేదో చేశావే
అనురాగపు తీపిని నాకు రుచి చూపించావే అమ్మల్లే

దేవత ఓ దేవత
నా మనసునే మార్చావే
ప్రేమతో నీ ప్రేమతో నను మనిషిగా మలిచావే
దేవత ఓ దేవత
నా మనసునే మార్చావే
ప్రేమతో నీ ప్రేమతో నను మనిషిగా మలిచావే
ఓ......ఓ......ఓ...

ఓహో..హో..హో...హో
నీ వల్లే కరిగిందే మనసంతా కను తడిగా
నిజమేదో తెలిసేలా నలుపంతా చెరిగెనుగా
గత జన్మల ఋణబంధముగా కలిశామే చెలితీగా
ఇకపై నేనెప్పటికి నీ ఊపిరిగాలల్లే ఉంటాగా

దేవత ఓ దేవత
నా మనసునే మార్చావే
ప్రేమతో నీ ప్రేమతో నను మనిషిగా మలిచావే
దేవత ఓ దేవత
నా మనసునే మార్చావే
ప్రేమతో నీ ప్రేమతో నను మనిషిగా మలిచావే
ఓ......ఓ......ఓ...

 

4 comments:

Karthik's voice has a good feel - lyrics are good.

కనులు మూసికుని వింటే చాలా హెవెన్లీగా ఉంటుందీ పాట వేణూజీ..

అవును శాంతి గారు.. వినడానికి చాలా బాగుంటుంది.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

థాంక్స్ అజ్ఞాత గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.