బుధవారం, ఏప్రిల్ 27, 2016

మధుర భావాల సుమమాల...

సాలూరి రాజేశ్వరరావు గారు స్వరపరచిన ఒక మధుర గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : జై జవాన్ (1970)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల, సుశీల

మధుర భావాల సుమమాల
మనసులో పూచె ఈ వేళ
పసిడి కలలేవో చివురించే
ప్రణయ రాగాలు పలికించే

 
మధుర భావాల సుమమాల
మనసులో పూచె ఈ వేళ

ఎదను అలరించు హారములో
పొదిగితిరి ఎన్ని పెన్నిధులో
ఎదను అలరించు హారములో
పొదిగితిరి ఎన్ని పెన్నిధులో
 
మరువరాని మమతలన్నీ
మెరిసిపోవాలి కన్నులలో

మధుర భావాల సుమమాల
మనసులో పూచె ఈ వేళ

 
సిరుల తులతూగు చెలి ఉన్నా
కరుణ చిలికేవు నాపైన
సిరుల తులతూగు చెలి ఉన్నా
కరుణ చిలికేవు నాపైన
 
కలిమికన్నా చెలిమి మిన్న
కలవు మణులెన్నో నీలో

మధుర భావాల సుమమాల
మనసులో పూచె ఈ వేళ

 
ఒకే పధమందు పయనించి
ఒకే గమ్యమ్ము ఆశించి
ఒకే పధమందు పయనించి
ఒకే గమ్యమ్ము ఆశించి
ఒకే మనసై ఒకే తనువై
ఉదయశిఖరాలు చేరితిమి

మధుర భావాల సుమమాల
మనసులో పూచె ఈ వేళ
 
పసిడి కలలేవో చివురించే
ప్రణయ రాగాలు పలికించే



0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.