శుక్రవారం, మార్చి 04, 2016

మనసంతా మేఘమై తేలిపోదా...

ఈ రోజు విడుదలవుతున్న కళ్యాణవైభోగమే చిత్రానికి ఆల్ ద బెస్ట్ చెబుతూ.. అందులోని ఓ చక్కని మెలోడీ విందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. ఆడియో పూర్తి పాట యూట్యూబ్ లో ఇక్కడ వినవచ్చు.


చిత్రం : కళ్యాణవైభోగమే (2016)
సంగీతం : కళ్యాణ్ కోడూరి
సాహిత్యం : లక్ష్మీ భూపాల్
గానం : చిన్మయి శ్రీపాద

మనసంతా మేఘమై తేలిపోదా
తనచూపే తెమ్మెరై తాకగా
ఎండల్లో చల్లగా చిరుజల్లే వెచ్చగా
పులకింతే కొత్తగా అందుకేనా...

మనసంతా మేఘమై తేలిపోదా
తనచూపే తెమ్మెరై తాకగా

ఇంత మోసం ఎవరికోసం
మనసుకే నేను చులకనా
ఎంత దూరం ఈ ప్రయాణం
కోపమా నా పైనా..
నువ్వే లేని నాలోనేను
ఉండలేననా
భారమైన ఊపిరి చూసీ
దాచుకున్న ఇష్టం తెలిసీ
అతని వైపు నన్నే లాగేనా
నిదురపోని కళ్ళను చూసీ
కలలు వచ్చి నిందలు వేసీ
అతని పరిచయాలే అడిగేనా

...తేలిపోదా...
...తాకగా...

వేణుగానం వెదురులోనే
దాగి ఉందన్న సంగతి
పెదవిపైనా అతని పేరే
పలికితే తెలిసింది
ఉయ్యాలూగె నా ఊహల్లో
ఊపిరైనది
బుగ్గమీద చిటికేస్తాడు
సిగ్గులోన ఎరుపవుతాడూ
ఎందుకింత సొంతం అయ్యాడే
రెప్పచాటు స్వప్నం వాడూ
కమ్ముకున్న మైకం వాడూ
ఏవిటింత పిచ్చై పోయానే

తనచూపే... తాకగా...
ఎండల్లో చల్లగా చిరుజల్లే వెచ్చగా
పులకింతే కొత్తగా అందుకేనా...
మనసంతా మేఘమై తేలిపోదా
తనచూపే తెమ్మెరై తాకగా
 


2 comments:

The song lyrics are buchiki buchiki. The lady painting is very good.

హహహ థాంక్స్ అజ్ఞాత గారు :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.