శనివారం, మార్చి 19, 2016

రాను రానంటూనే...

జయం సినిమా కోసం ఆర్.పి.పట్నాయక్ స్వరపరచిన ఓ హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : జయం (2002)
సంగీతం : ఆర్.పి. పట్నాయక్
సాహిత్యం : కులశేఖర్
గానం : ఆర్.పి. పట్నాయక్, ఉష

ఏమైందిరా - బాధగా ఉంది
నాకు లేని బాధ నీకెందుకురా
నీ బాధ నా బాధ కాదా

ఎహే రాయే..
హబ్బబ్బబ్బ రాను రాను
నాను రాను కుదరదయ్యో
కాదు కాదు ఈలు కాదు వొగ్గేయ్ వయ్యో
వొద్దు వొద్దు మీద మీద పడకరయ్యో
సిగ్గు సిగ్గు సిన్నకోక లాగకయ్యో


రాను రానంటూనే సిన్నదో సిన్నదో
రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది
రాను రానంటూనే సిన్నదో సిన్నదో
రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది
కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో
తోటకాడకొచ్చిందా కుర్రదో కుర్రది
పచ్చి పచ్చివంటూనే పిల్లదో పిల్లదో
పళ్ళట్టుకొచ్చిందోయ్ పిల్లదో పిల్లది

రాను రానంటూనే సిన్నదో సిన్నదో
రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది
 


ఏం పండు తీసుకొచ్చిందిరా అబ్బాయ్
యాపిలు పండు నారింజ పండు
బత్తాయి పండు బొప్పాయి పండు
అనస పండు పనస పండు
నిమ్మ పండు దానిమ్మ పండు
మామిడి పండు అరటి పండు

రాను అని కాదు అని అంతలేసి మాటలని
సంతకొచ్చె సూడవయ్యో సిన్నది
కాదనంటే ఔనని  లే లేదనంటే ఉందనిలే
ఆడవారి మాట తీరు వేరులే
ఔనా మైనా మాతో చిందేయ్ చిందేయ్
బాబోయ్ రానోయ్ నాకసలే సిగ్గోయ్ సిగ్గోయ్
 

సిగ్గు సిగ్గంటూనే సిన్నదో సిన్నదో
సీరంతా జార్చిందా సిన్నదో సిన్నది
కస్సుబుస్సంటూనే కుర్రదో కుర్రదో
కౌగిట్లో వాలిందా కుర్రదో కుర్రది

 

హరిలో రంగ హరి హరి
స్వామి రంగ హరి హరి
ఏంటో ఎవరూ పట్టించుకోట్లేదేంటి
గాజువాక పిల్లా మే గాజులోళ్ళం కాదా
చెయ్యి చాపలేదా మా గాజు తొడగలేదా

తప్పు అని గిప్పు అని అందరిలో ముందరని
సాటుకొచ్చి సిందులేసె సిన్నది
తప్పనంటే ఒప్పనలే ఒప్పనంటే తప్పనలే
సూటిగాను సెప్పదయ్యో ఆడది
రావే పిల్లా ఎందుకు మల్లాగుల్లా
ఎల్లోయ్ ఎల్లోయ్ ఎల్లెల్లోయ్ ఎల్లో ఎల్లోయ్
 

రాను రానంటూనే సిన్నదో సిన్నదో
రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది
కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో
తోటకాడకొచ్చిందా కుర్రదో కుర్రది
పచ్చి పచ్చివంటూనే పిల్లదో పిల్లదో
పళ్ళట్టుకొచ్చిందోయ్ పిల్లదో పిల్లది
 

3 comments:


రాననె చిన్నది నాతో
మానేయ్ అంటే చ!సిగ్గు మాటున చీరే
నేనే నందోయ్! రావే
రాణీ నీ మోము జూడ రాజా నేనే !

జిలేబి

​ఈ పాట రాసింది భాస్కరభట్ల గారు కాదు "కులశేఖర్" గారు. పైగా ఈ సినిమాలో అన్ని పాటలు కులశేఖర్ గారే రాశారు ​

థాంక్స్ విద్యాసాగర్ గారు సరిచేశాను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.