ఆదివారం, ఫిబ్రవరి 07, 2016

ఈ మంచుల్లో ప్రేమంచుల్లో...

రంగం చిత్రంలోని ఓ చక్కని ప్రేమగీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.

చిత్రం : రంగం (2011)
రచన : వనమాలి
సంగీతం : హారీస్ జయరాజ్
గానం : శ్రీరామ్ పార్థసారథి, బాంబే జయశ్రీ

everything is chilled now
all Is gonna be alright
Oh i will be there
i will be there for you
everything is chilled now
frozen in love lets warm
and close around now

ఈ మంచుల్లో ప్రేమంచుల్లో ఎన్నెన్నో సంగతులు
నీరెండల్లో ఈ గుండెల్లో ఎన్నెన్నో సందడులు
కవ్వించే చీకటి కన్నుల్లో ఈ తడి ఇవ్వాళే వీడెనులే
ఉండుండి ఊహలు ఈ పిల్లగాలులు
నిన్నే పిలిచెనులే

ఈ మంచుల్లో ప్రేమంచుల్లో ఎన్నెన్నో సంగతులు
నీరెండల్లో ఈ గుండెల్లో ఎన్నెన్నో సందడులు
కవ్వించే చీకటి కన్నుల్లో ఈ తడి ఇవ్వాళే వీడెనులే
ఉండుండి ఊహలు ఈ పిల్లగాలులు
నిన్నే పిలిచెనులే

కనులకు జతగా వలపుల కథనే
కలలుగ కొసరనా
గలగల పలికే పెదవుల కొస
నే కబురునై నిలవనా
నేడిలా మది విరిసెను ప్రేమలో
తేనెలే పెదవొలికెను జంటలో 
కలయికలో...

ఈ మంచుల్లో ప్రేమంచుల్లో ఎన్నెన్నో సంగతులు
నీరెండల్లో ఈ గుండెల్లో ఎన్నెన్నో సందడులు
కవ్వించే చీకటి కన్నుల్లో ఈ తడి ఇవ్వాళే వీడెనులే
ఉండుండి ఊహలు ఈ పిల్లగాలులు
నిన్నే పిలిచెనులే

  everything is chilled now
all Is gonna be alright
Oh i will be there
i will be there for you
everything is chilled now
frozen in love lets warm
and close around now

  మలుపులు దాటి మనసులు మీటి
నిలిచె నీ మమతలు 
ఒకపరి జననం ఒకపరి మరణం
నిలువునా తొలిచెలే
 
యవ్వనం మనసుకు తొలి మోహనం
చుంబనం వయసుకు ఒక వాయనం
అనుదినము...

ఈ మంచుల్లో ప్రేమంచుల్లో ఎన్నెన్నో సంగతులు
నీరెండల్లో ఈ గుండెల్లో ఎన్నెన్నో సందడులు
 
కవ్వించే చీకటి కన్నుల్లో ఈ తడి ఇవ్వాళే వీడెనులే
ఉండుండి ఊహలు ఈ పిల్లగాలులు
నిన్నే పిలిచెనులే

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.