శుక్రవారం, డిసెంబర్ 04, 2015

వసంతం పల్లకి...

వంశీ గారి దర్శకత్వంలో వచ్చిన స్వరకల్పన చిత్రంలోని ఓ చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు లేదా యూట్యూబ్ జ్యూక్ బాక్స్ లో మరింత క్లారిటీతో ఆడియో ఇక్కడ వినవచ్చు.


చిత్రం : స్వరకల్పన (1989) 
సంగీతం : అమర్ (గంగై అమరన్)
సాహిత్యం : ??
గానం : బాలు, జానకి

వసంతం పల్లకి వనాల రాణికి
సుగంధం పల్లవి సుధామయ గీతికి
సరాగం సాగగానే మురళి సరళి
పరాగం పాట పాడె పవన రమణి
జగాలే ఊగే తియ్యని హాయిలో

వసంతం పల్లకి వనాల రాణికి
సుగంధం పల్లవి సుధామయ గీతికి

గుసగుసల కిసలయం
కిలకిలల జలజంనవమదన మదగజం
కనబడుట సహజం
ఎటు చూసినా నీ రూపమే
ఎద మీటవా ఋతురాణిలా
అందాల బాలా అజవరాలా
అరవిరుల మరుల లలన

వసంతం పల్లకి వనాల రాణికి
సుగంధం పల్లవి సుధామయ గీతికి

కొసమెరుపు కులుకుల
కువకువల నెమలి
విరి పొదల మధువుల
రిమరిమల భ్రమరి
వర్దిల్లుమా వాసంతమా
వడబోసిన రసభావమా
లోకాలనేలే నెరజాణా
నవధవళ కమల లయన

వసంతం పల్లకి వనాల రాణికి
సుగంధం పల్లవి సుధామయ గీతికి
సరాగం సాగగానే మురళి సరళి
పరాగం పాట పాడె పవన రమణి
జగాలే ఊగే తియ్యని హాయిలో

వసంతం ఆహహా.. లలలల్లా..

 

3 comments:

---> ఈ పదజాలం చూస్తూంటే సాహిత్యం మావయ్య గారి దేమో నని పిస్తోందండి ?

కిలకిలల జలజంనవమదన మదగజం

అయ్యా
ఈ సినిమాకి సంగీతాన్ని గంగై అమరన్ గారు "అమర్" అనే పేరుతో వహించారు.... ఇళయరాజా కాదు... గమనించండి

థాంక్స్ జిలేబి గారు.. ఈ సినిమా పాటల రచయితలలో వంశీ ఇళయరాజా లతో పాటు సిరివెన్నెల, జొన్నవిత్తుల, ముళ్ళపూడి శాస్త్రి, నాయనికృష్ణమూర్తి గార్లున్నారండీ వీరిలో ఒకరై ఉండాలి.

థాంక్స్ ఫర్ ద కరెక్షన్ విద్యాసాగర్ గారు సరిచేశాను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.