బుధవారం, నవంబర్ 04, 2015

జింజిం తారారే..

అనుబంధం చిత్రంలోని ఓ హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. నాకు రేడియో పరిచయం చేసిన పాటల్లో ఇదీ ఒకటి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : అనుబంధం (1984)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం :
గానం : బాలు, సుశీల

జింజింతారారే ఏ ఏ జింజింతారారే ఏ ఏ
చలిగాలి సాయంత్రం చెలరేగే సంగీతం
పొద్దువాలే వేళాయే ముద్దుగుమ్మా రావే
ఇద్దరున్న కౌగిట్లో ముద్దుతీర్చి పోవే
నీలో చూసా సిగ్గుపడ్డ పరువాలు
నాలో చూడు దగ్గరైన ప్రాణాలు

జింజింతారారే ఏ ఏ జింజింతారారే ఏ ఏ
చలిగాలి చెలగాటం చెలరేగే ఉబలాటం
సందెపొద్దువేళాయే చందమామ రావే
చీకటైన పొదరింట దీపమెట్టిపోవే
నన్నే తాకే అగ్గిపూల బాణాలు
నాకే సోకే కొంటెచూపు కోణాలు


పువ్వుల వానల్లో నవ్వుల నావల్లే
నావంక వస్తుంటే నాజూకు తీస్తుంటే
వెచ్చని వెలుగుల్లో వచ్చిన వయసల్లే
వాటేసుకుంటుంటే వైనాలు చూస్తుంటే

సూరీడేమో కొండలు దాటే
నా ఈడేమో కొంగులు దాటే
నీ ముద్దు తాంబూలమిచ్చుకో
ఎర్రంగ వలపే పండించుకో
తూనీగల్లే తూలిపోయే నడుమివ్వు
నిన్నే చేరే నిన్నలేని నడకివ్వు

జింజింతారారే ఏ ఏ జింజింతారారే ఏ ఏ

కొండకోనల్లో ఎండవానల్లో
మురిపాల ముంగిట్లో ముద్దాడుకుంటుంటే

వేసవి చూపుల్తో రాసిన జాబుల్తో
అందాల పందిట్లో నిన్నల్లుకుంటుంటే
అల్లరి కళ్ళు ఆరాతీసే
దూరాలన్ని చేరువచేసే
ఒడిచేరి పరువాలు పంచుకో
బిడియాల గడపింక దాటుకో
నింగి నేల తొంగి చూసే సాక్ష్యాలు
నీకు నాకు పెళ్ళిచేసే చుట్టాలూ

జింజింతారారే ఏ ఏ జింజింతారారే ఏ ఏ
చలిగాలి చెలగాటం చెలరేగే ఉబలాటం
పొద్దువాలే వేళాయే ముద్దుగుమ్మా రావే
సందెపొద్దువేళాయే చందమామ రావే
నీలో చూసా సిగ్గుపడ్డ పరువాలు
నన్నే తాకే అగ్గిపూల బాణాలు
జింజింతారారే ఏ ఏ జింజింతారారే ఏ ఏ



2 comments:

మీ గులాబీ పాటల తోటలో అప్పుడప్పుడూ చేమంతులూ వస్తుంటాయనుకుంట..ఓకే సాంగ్..

హహహ మీ పోలిక బాగుందండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.