సోమవారం, నవంబర్ 16, 2015

మహాదేవ శంభో..

ఈ రోజు కార్తీక సోమవారం సంధర్బంగా ఆ పరమ శివుడ్ని కీర్తించే ఓ చక్కని పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : భీష్మ (1962)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : ఆరుద్ర
గానం: సుశీల

మహాదేవ శంభో..ఓ..ఓ
మహాదేవ శంభో..ఓ ఓ ...
మహేశా గిరీశా ప్రభో దేవ దేవా
మొరాలించి పాలించ రావా..

మహాదేవ శంభో..ఓ..ఓ
మహాదేవ శంభో..ఓ..ఓ


జటాఝూటధారి.. శివా.. చంద్రమౌళీ..
నిటాలాక్ష.. నీవే సదా నాకు రక్ష
జటాఝూటధారి.. శివా.. చంద్రమౌళీ..
నిటాలాక్ష.. నీవే సదా నాకు రక్ష..
ప్రతీకార శక్తి ప్రసాదించ రావా
ప్రసన్నమ్ము కావా.. ప్రసన్నమ్ము కావా

మహాదేవ శంభో..ఓ..ఓ
మహాదేవ శంభో..ఓఓ..


మహేశా.. గిరీశా.. ప్రభో దేవ దేవా..
మొరాలించి పాలించ రావా
మహాదేవ శంభో..
శివోహం... శివోహం..
శివోహం... శివోహం..

 

2 comments:

అద్భుతమైన పాటండీ..యెంతో భావోద్వేగం తో కూడిన పాటైనా, యెక్కడా మెలోడీ మిస్ కానివ్వలేదు మన స్వారాలూరు రాజేశ్వరరావుగారు..

చాలా కరెక్ట్ గా చెప్పారండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతిగారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.