గురువారం, నవంబర్ 12, 2015

చందమామ నేనేలే...

ఇళయరాజా గారి స్వరకల్పనలో తమిళ్ లో సూపర్ హిట్ అయిన "రాజ రాజ చోళన్ నా" పాటకు తెలుగు అనువాదాన్ని ఈ రోజు తలచుకుందాం.  ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : రెండు తోకల పిట్ట (1987)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు

చందమామ నేనేలే నా అందమైన తారా నీవే
చందమామ నేనేలే నా అందమైన తారా నీవే
నేనే నీవై రావే ఆకాశవీధిలోన అందాలు నీవెలే
నీలోని సోయగాలు నావేనులే

చందమామ నేనేలే 
నా అందమైన తారా నీవే
నేనే నీవై రావే

నీ కళ్ళలోన ఉంది కర్పూర దీపమే
నిలువెల్ల ఉంది నీలో శృంగారమే
నా శ్వాసలోన ఉంది ఓ ప్రేమ నాటకం
నీ ధ్యాసలోన ఉంది నా జీవితం
నయనాలు రెండు ఉన్నా చూపొక్కటే
పాదాలు రెండు ఉన్న బాటొక్కటే
నా చూపు నీవులే  నీ బాట నేనులే
నా కంటికి నట్టింటికీ ఓ వెలుగులీవే దేవి

చందమామ నేనేలే 
నా అందమైన తారా నీవే
నేనే నీవై రావే

నీ నవ్వులోన ఉంది కార్తీక పౌర్ణమి
నీ హొయలలోన ఉంది వసంతమే
నీ పెదవి కోరి పిలిచె నను పేరంటమే
నీ ఈడు నాకు ఇచ్చె తాంబూలమే
నీ పైట చెంగు చేసె సంకేతమే
నీ పాల పొంగు పాడె సంగీతమే
ఇది ప్రేమ సాగరం ఈదాలి ఇద్దరం
నా ప్రాణమూ నా సర్వమూ ఏనాడు నీవే దేవి

చందమామ నేనేలే నా అందమైన తారా నీవే
చందమామ నేనేలే నా అందమైన తారా నీవే
నేనే నీవై రావే ఆకాశవీధిలోని అందాలు నీవెలే
నీలోని సోయగాలు నావేనులే
చందమామ నేనేలే నా అందమైన తారా నీవే
నేనే నీవై రావే

2 comments:

మబ్బుల రధం లో వెళ్తున్న ఫీలింగ్ కలుగుతుంది..ఈ పాట వింటే..

బాగా చెప్పారు థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.