బుధవారం, సెప్టెంబర్ 09, 2015

ఆవేశమంతా ఆలాపనేలే..

వంశీ, ఇళయరాజా ల మ్యూజికల్ మ్యాజిక్ "ఆలాపన" చిత్రంలోని ఒక అందమైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఆలాపన (1986)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం

ఆవేశమంతా ఆలాపనేలే ఎదలయలో
ఆవేశమంతా ఆలాపనేలే ఉదయినిగా
నాలో జ్వలించే వర్ణాల రచన
నాలో జనించే స్వరాలా

ఆవేశమంతా ఆలాపనేలే

నిస నిస పసగమపనీస నిస నీస పసగమమ
సాసపామ మామదాద మదనిప మదనిప మదనిప
సాసమామ మామదాద సనిప సనిప సనిపదగస


అలపైటలేసే సెలపాట విన్నా
గిరివీణమీటే జలపాతమన్నా
నాలోన సాగే ఆలాపన
రాగాలు తీసే ఆలోచన
ఝురుల జతుల నాట్యం
అరవిరుల మరుల కావ్యం
ఎగసి ఎగసి నాలో
గళ మధువులడిగె గానం
నిదురలేచె నాలో హృదయమే

ఆవేశమంతా ఆలాపనేలే ఎదలయలో
ఆవేశమంతా ఆలాపనేలే


సానీస పనీస నీసగమగనీ
సాసానిద దనిప గమప గమప గమప
గమగస గమగమ నిసనిస గమగపదనిస


వనకన్యలాడె తొలిమాసమన్నా
గోధూళితెరలో మలిసంధ్యకన్నా
అందాలు కరిగే ఆవేదన
నాదాల గుడిలో ఆరాధన
చిలిపి చినుకు చందం
పురి విడిన నెమలిపింఛం
ఎదను కదిపి నాలో
విరిపొదలు వెతికె మోహం
బదులులేని ఏదో పిలుపులా

ఆవేశమంతా ఆలాపనేలే ఎదలయలో
నాలో జ్వలించే వర్ణాల రచన
నాలో జనించే స్వరాలా
ఆవేశమంతా ఆలాపనేలే

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.