సోమవారం, సెప్టెంబర్ 21, 2015

నీ కోల కళ్ళకు నీరాజనాలు..

హేమాహేమీలు చిత్రం కోసం రమేష్ నాయుడు గారు స్వరపరచిన ఒక అందమైన ప్రేమగీతం ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : హేమా హేమీలు (1979)
సంగీతం : రమేష్ నాయుడు
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల

నీ కోల కళ్ళకు నీరాజనాలు
ఆ వాలు చూపుకు అభివందనాలు
ఈ కోప తాపాలకు ఆ తీపి శాపాలకు
ఈ కోప తాపాలకు ఆ తీపి శాపాలకు
అందించనా నీకు హరిచందనాలు

నీ కోల కళ్ళకు నీరాజనాలు
ఆ వాలు చూపులకు అభివందనాలు

కోటేరు లాంటి ఆ కొస ముక్కు
పొద్దు నిద్దర లేచినట్లు ఆ బొట్టు
మిసమిసలు పసిగట్టీ కసిపట్టి బుసగొట్టే
పడగెత్తు పైటున్న ఆ చీరకట్టు
జిగినీల జాకెట్టు సొగసైన లాకెట్టు
 
జిగినీల జాకెట్టు సొగసైన లాకెట్టు 
విడిచి పెడితే పెట్టు నా మీద ఒట్టు

నీ కొంటె కవితకు నీరాజనాలు
ఆ వాడి చూపుకు అభివందనాలు
ఈ ఆప సోపాలకు ఆ విరహ తాపాలకు
ఈ ఆప సోపాలకు ఆ విరహ తాపాలకు
అందించనా నేను సుస్వాగతాలు

నీ కొంటె కవితకు నీరాజనాలు
ఆ వాడి చూపుకు అభివందనాలు


నీ వలపే ఉసి గొలుపు 
నా చెలిమే చెయిగలుపు
పొలిమేరలో పిలుపు పులకింతలే రేపు
జడలోని మల్లికలు జవరాలి అల్లికలు
చలిపెంచే కోరికలు జాబిలితో కలయికలు
ఈ ఆరుబయట అందాల అల్లరులు  
ఈ పుట నాలో పలికించే కిన్నెరలూ
కలిసిపోనా ఏరు నీరై 
నేనింక నీవై నీవింక నేనై

నీ కోల కళ్ళకు నీరాజనాలు
ఆ వాలు చూపుకు అభివందనాలు
ఈ కోప తాపాలకు ఆ తీపి శాపాలకు
ఈ కోప తాపాలకు ఆ తీపి శాపాలకు
అందించనా నీకు హరిచందనాలు 

2 comments:


ఈ మూవీ లో అన్ని సాంగ్సూ బావుంటాయండి..ఇంక్లూడింగ్ గోలుకొండ కాడ..పిక్చర్ కూడా తమాషాగా ఉంటుంది..యెప్పుడో చిన్నప్పుడు చూసిన మూవీ..ఇంతందం గా గుర్తు చేసినందుకు థాంక్యూ..

ఓహ్ అవునా శాంతి గారూ.. నాకు ఈ సినిమాలో ఒకటి రెండు పాటలే విన్న గుర్తు ఇదొకటి, "ఏఊరు.. ఏ వాడ అందగాడా" పాట కూడా విన్నాను.. మిగిలినవి వినాలి.. సినిమా నేను చూడలేదండీ.. దొరికితే చూస్తాను. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.