బుధవారం, సెప్టెంబర్ 02, 2015

ఇంతే ఇంతింతే..

బాలు చిత్రం కోసం మణిశర్మ స్వర సారధ్యంలో చంద్రబోస్ గారు రాసిన ఈ పాట యువతకు మంచి స్ఫూర్తినిచ్చే పాట నాకు బాగా ఇష్టమైన పాట. ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : బాలు (2005)
సాహిత్యం : చంద్రబోస్
సంగీతం : మణిశర్మ
గానం : కే కే

ఇంతే ఇంతింతే ఇంతే ఇంతింతే
ఆలోచిస్తే అంతా ఇంతింతే
కన్ను ఇంతే కనుపాప ఇంతే
లోకం లోతు చూడాలంతే

ఇంతే ఇంతింతే ఇంతే ఇంతింతే
ఆలోచిస్తే అంతా ఇంతింతే
కన్ను ఇంతే కనుపాప ఇంతే
లోకం లోతు చూడాలంతే
లోకం లోతు చూడాలంతే

మొగ్గల్లోన దాగుందీ కాయో పండో, కనిపెట్టాలి ముందే
మబ్బుల్లోన దాగుందీ చినుకో తూఫానో పసిగట్టాలి ముందే
మనుషుల్లో మంచోడెవరో ముంచేదెవరో మనసెట్టీ చూడాలంతే
ఈ మట్టి లోని వజ్రం చూడు బొగ్గులోని అగ్గిని చూడు
అన్నిటికన్నా నీలోని నిన్నే చూడు
అలా చూస్తే ఎదురే లేదంతే 
నువ్వలా చేస్తే తిరుగే లేదంతే
రాశి ఫలాలన్ని వచ్చును నీ వెంటే
తొమ్మిది గ్రహాలన్ని పనులే మాని తిరుగును నీ చుట్టే

ఇంతే ఇంతింతే ఇంతే ఇంతింతే
ఆలోచిస్తే అంతా ఇంతింతే

గుడిసెల్లోని పేదలకి స్నేహితుడయ్యే గుణముండాలి నీలో
మేడల్లోని అమ్మడికి ప్రేమికుడయ్యే పొగరుండాలి నీలో
దేశాన్నే శోకం నుంచి చీకటి నుంచి రక్షించే సైనికుడవ్వాలి
నీ పనుల్లోను శ్రామికుడల్లే పగలురేయి కార్మికుడల్లే
సముద్రంలో నావికుడల్లే ముందుకు పోతుంటే
జనం మెచ్చే నాయకుడవుతావు 
హే జగం మెచ్చే ఉత్తముడవుతావు
ప్రపంచంలో దేవుడిఔతావు
ఈ బూమ్మీద అసలు సిసలు మానవుడవుతావు

ఇంతే ఇంతింతే ఇంతే ఇంతింతే
ఆలోచిస్తే అంతా ఇంతింతే
కన్ను ఇంతే కనుపాప ఇంతే
లోకం లోతు చూడాలంతే
లోకం లోతు చూడాలంతే



0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.