ఆదివారం, ఆగస్టు 09, 2015

నీలి మేఘమాలనో...

మదన కామరాజు కథ చిత్రంలోని ఓ అందమైన డ్యుయెట్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : మదనకామరాజు కథ(1962)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : జి.కృష్ణమూర్తి
గానం : పీ బీ శ్రీనివాస్, సుశీల

నీలి మేఘమాలవో నీలాలతారవో
నీ సోయగాలతో మదినీ దోచిపోదువో
నీలి మేఘమాలవో..

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్

నీలి మేఘమాలనో నీలాల తారనో
నా సోయగాలతో మదినీ దోచిపోతినో
నీలి మేఘమాలనో..


నీ రాక కోసమే చెలీ..నే వేచి యుంటినే
ఆరాటమేలనో ప్రియా..నే చెంతనుంటినే 
ఆనంద మధుర గీతములా..ఆలపింతమా
నీలి మేఘమాలనో..


చివురించు వలపు తీవెలా..విరిపూలు పూయగా
చిరునవ్వు విరుపు లోపలా..హరివిల్లు విరియగా
నెలవంక నావలోన మనమూ..కలసి పోదమా
నీలి మేఘమాలవో..

మనలోని కలత మాయమై..మన ఆశ తీరెగా
అనురాగ రాగమే ఇక..మన రాగమాయేగా
మనసార ప్రేమ మాధురులా..సాగిపోదమా

నీలి మేఘమాలనో నీలాల తారనో
నీ సోయగాలతో మదినీ దోచిపోదువో

1 comments:

చౌదవీక చాంద్ హో..యే భాషలోనైనా..యెవ్వర్ గ్రీన్ మెలోడియస్ ట్యూన్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.