గురువారం, ఆగస్టు 27, 2015

ఏముందో నవ్వే కన్నుల్లో..

మిక్కీ జె మేయర్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఒక అందమైన వనమాలి రచన ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (2012)
సంగీతం : మిక్కీ జె.మేయర్
సాహిత్యం : వనమాలి
గానం : కార్తీక్

Beautiful smile.. beautiful face
Beautiful eyes.. you're nothing but grace
Beautiful you.. I look amazed
what is your name.. what is your name

ఏముందో నవ్వే కన్నుల్లో.. 
ఏముందో ఆ పెదవంచుల్లో
ఏముందో లాగే ఒంపుల్లో.. 
ఏముందో ఈ అమ్మాయిల్లో
ఏమౌతుందో ఏమో ఇంతందం చూస్తుంటే
వారిస్తున్నా వింటుందా వయసే నా మాటే
తప్పేదైనా జరిగే వీలుందే నీ వెన్నంటే ఉంటే...

Beautiful smile.. beautiful face
Beautiful eyes.. you're nothing but grace
ఏముందో నవ్వే కన్నుల్లో..
ఏముందో ఈ అమ్మాయిల్లో

ఎదనే కొరికే చూపందం.. అలకే అందం
మనసే తెలిపే మాటందం
ప్రతీది అందం.. జగమే కననీ అందం
తన జతలో చెలిమే ఆనందం

ఏముందో నవ్వే కన్నుల్లో.. 
ఏముందో ఆ పెదవంచుల్లో
ఏముందో లాగే ఒంపుల్లో.. 
ఏముందో ఈ అమ్మాయిల్లో

మెరుపై కదిలే మేనందం.. నడకే అందం
నలిగే నడుమే ఓ అందం.. పలుకే అందం
మగువే అందం కాదా
మది తనకే వశమైపోదా

ఏమౌతుందో ఏమో ఇంతందం చూస్తుంటే
వారిస్తున్నా వింటుందా వయసే నా మాటే
తప్పేదైనా జరిగే వీలుందే.. నీ..వెన్నంటే.. ఉంటే


1 comments:

ఈ పాటలో సాహిత్యం చూస్తుంటే యెందుకో పద్మవ్యూహం లో కన్నులకు చూపందం పాట గుర్తొచ్చింది వెణూజీ..అది ఇప్పటిదాకా ప్రెజెంట్ చేసి ఉండక పోతే చేస్తారా..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.