శనివారం, జూన్ 06, 2015

స్ట్రాబెర్రి కన్నె...

మెరుపు కలలు సినిమాలోని ఒక సరదా ఐన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : మెరుపుకలలు (1997) 
సంగీతం : ఎ.ఆర్.రహ్మాన్
సాహిత్యం : వేటూరి  
గానం : మనో, స్వర్ణలత

స్ట్రాబెర్రి కన్నె.... ఊర్వశి వన్నే...
సిల్వర్ స్పూన్ చేత్తోనే పుట్టినదాన
ఫ్రిడ్జ్ లోన ఆపిల్ లా నవ నవ కన్నా
వెండి కంచం జోడు బెంజ్ AC కారు
ఇన్ని ఉన్నా నీ గుండెల్లో భారమదేల
తనువు విడిపోయింద చనువు కరువయ్యిందా
ఉలుకు కళ్ళల్లో శోకాల శ్లోకమదేల

ఏంట్రా రియాక్షనే లేదు 
వాల్యూం పెంచాలేమో  

స్ట్రాబెర్రి కన్నె.... ఊర్వశి వన్నే...
సిల్వర్ స్పూన్ చేత్తోనే పుట్టినదాన
ఫ్రిడ్జ్ లోన ఆపిల్ లా నవ నవ కన్నా
వెండి కంచం జోడు బెంజ్ AC కారు
ఇన్ని ఉన్నా నీ గుండెల్లో భారమదేల
తనువు విడిపోయింద చనువు కరువయ్యిందా
ఉలుకు కళ్ళల్లో శోకాల శ్లోకమదేల

నీ ఆడతనం బేలతనం ఇప్పుడు మరుగై
నీ కల్పనలే అద్భుతమై నిప్పులు చెరిగే
ముగించవే... పైత్యం...
ఫలించనీ ... వైద్యం

పాత పైత్యం పిచ్చితనం రెండు చెల్లే
నీది వైద్యం వెర్రితనం నాడే చెల్లే
ముందు తరతరాలెవ్వరు మూఢులు కాదే
నాలోన గొడవేదింక


అతని సేవలో ఎప్పుడు లాభం లేదు
మనిషి సేవలే చేసినా తప్పేం లేదు
నేను ఎన్నడు భూమికి భారం కాను
నా బాటలో నరకం లేదు
నిన్న కలలే కన్నా
నేడు కలిసే కన్నా
నాడు తాళితో చితికైన జత కాలేను
ముందు మాల యోగం వెనక సంకెల బంధం
ఇంకా గజిబిజి కళ్యాణం దోవే రద్దు

 
అయ్యో పెళ్లొద్దంట రూట్ మార్చు

కన్నె కళ్ళు ఎన్నో కళలు
ఈ చెక్కిళ్ళు ఎంత ఇష్టం
తల్లో పూసిన తామర నేత్రం
ఏం పెదవి అది ఏం పెదవి
చెర్రి పండు వంటి చిన్ని పెదవి

నోసే కొంచెం ఓవర్ సైజు
ఇట్స్ ఓకే ప్లాస్టిక్ సర్జరీ చేయిద్దాం

ఏయ్ స్ప్రింగ్ బాడీ ఇలా రా
నిద్దర లేవగానే మొహం చూస్కునే అలవాటుందా
అఫ్ కోర్స్ 
ఏం చూశావ్ 
అందమైన ఫేసమ్మా 
కాదు జూనుంచి తప్పించుకొచ్చిన కోతిని

ఎవరి ముక్కు ఎవరి పాలు చేసి పెట్టినదెవరో
ఉన్న మెదడు తమకు నిండు సున్నా చేసినదేవరో
ఎవరహో... పురుషుడో...
మంకీయా... మనిషియా..

 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.