గురువారం, జూన్ 11, 2015

శక్తి నివ్వూ...

బాబా చిత్రంకోసం ఎ.ఆర్.రహ్మాన్ స్వరపరచిన ఒక మంచి పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : బాబా (2002)
సంగీతం : ఎ.ఆర్.రహ్మాన్
సాహిత్యం : శివగణేష్
గానం : కార్తీక్

మేమడుగేస్తే అదరాలి అధికార పీఠం
మెమెదురొస్తే బెదరాలి భేతాళ భూతం
శక్తి నివ్వూ.. శక్తినివ్వూ..
శక్తి నివ్వూ.. శక్తినివ్వూ..
దేవా...దేవా...
తల్లివి నీవే తండ్రివి నీవే
ప్రణవము నీవే ప్రాణము నీవే
తల్లివి నీవే తండ్రివి నీవే
ప్రణవము నీవే ప్రాణము నీవే
రేణువు నీవే స్థాణువు నీవే
జులుమునణచుటకు 
గురిని గెలుచుటకు శక్తినివ్వూ

మేమడుగేస్తే అదరాలి అధికార పీఠం
మేమెదురొస్తే బెదరాలి భేతాళ భూతం
శక్తి నివ్వూ..

 
నట్టేటి నావలనే నడిపించు శక్తినివ్వూ
మునిగేటి జీవులనే రక్షించు శక్తినివ్వూ
తల పొగరు సిగపట్టి ఈడ్పించు శక్తినివ్వూ
పేదింటి చీకటిని తొలగించు శక్తినివ్వూ
దావాగ్ని జ్వాలల్ని ఛేదించే శక్తినివ్వూ
నా మాటతో ఊరు మారేటి శక్తినివ్వూ

తల్లివి నీవే తండ్రివి నీవే
ప్రణవము నీవే ప్రాణము నీవే
దేవా...దేవా...

 
బిగిపట్టు పట్టాక సడలించబోను
ముందడుగు వేశాక వెనుకాడబోను
ననునమ్ము తమ్ముళ్ని వంచించబోను
ఓ నిచ్చెనై నిలుచుండి నేమోసపోను
నా ప్రజల క్షేమాన్ని నే మరిచిపోను
నా ప్రజల క్షేమాన్ని నే మరిచిపోను
నే బ్రతికేది నీ కొరకె విడిచి నే పోనూ
గద్దెలను మిద్దెలను నే కోరుకోను
కాలాల హద్దులను నే మించిపోను
దేవా... దేవా...

తల్లివి నీవే తండ్రివి నీవే
ప్రణవము నీవే ప్రాణము నీవే
తల్లివి నీవే తండ్రివి నీవే
ప్రణవము నీవే ప్రాణము నీవే
రేణువు నీవే స్థాణువు నీవే
జులుమునణచుటకు
గురిని గెలుచుటకు శక్తినివ్వూ
నేనడుగేస్తే అదరాలి అధికార పీఠం
నేనెదురొస్తే బెదరాలి భేతాళ భూతం
శక్తి నివ్వూ..శక్తి నివ్వూ..


2 comments:

నాకు చాలా ఇష్టమైన పాటండీ..

"తల్లివి నీవే తండ్రివి నీవే ప్రణవము నీవే ప్రాణము నీవే" వింటుంటేనే ఆనందంగా అనిపిస్తుంది..

థాంక్స్ రాజ్యలక్ష్మి గారు... అవునండి మంచి అనుభూతినిచ్చే పాట..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.