గురువారం, ఏప్రిల్ 02, 2015

పలికినదీ పిలిచినది...

సీతారాములు చిత్రం కోసం సత్యం గారు చేసిన ఈ అద్భుతమైన కంపొజిషన్ ను వినండి ఎంత బాగుంటుందో. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : సీతారాములు (1980)
సంగీతం : సత్యం
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు, సుశీల

వరవీణా మృదుపాణి వనరుహలోచను రాణి
సురుచిర బంభరవేణి సురనుత కల్యాణి
నిరుపమ శుభగుణలోల నిరతజయాప్రదశీల
వరదాప్రియ రంగనాయకి వాంఛిత ఫలదాయకి
సరసీజాసన జనని.. జయ జయ జయ...వరవీణా

 
పలికినది... పిలిచినది...
పరవశమై నవమోహనరాగం
పలికినది... పిలిచినది...
పరవశమై నవమోహన రాగం
 
పలికినది... పిలిచినది...
పరవశమై నవమోహనరాగం 
పలికినది... పిలిచినది...
పరవశమై నవమోహన రాగం
 
పలికినది... పిలిచినది..

గగనాంగనాలింగనోత్సాహియై...
జగమెల్ల పులకించె సుమగుచ్ఛమై
గగనాంగనాలింగనోత్సాహియై ...
జగమెల్ల పులకించె సుమగుచ్ఛమై..
మమతలు అల్లిన పెళ్ళిపందిరై ...
మమతలు అల్లిన పెళ్ళిపందిరై ...
మనసులు వీసిన ప్రేమ గంధమై ....
 

పలికినది... పిలిచినది..
పరవశమై నవమోహనరాగం
పలికినది పిలిచినది..

గంగా తరంగాల సంగీతమై...
కమణీయ రమణీయ యువగీతమై
గంగా తరంగాల సంగీతమై...
కమణీయ రమణీయ యువగీతమై
 
కలిమికి లేమికి తొలి వివాహమై..
కలిమికి లేమికి తొలి వివాహమై..
యువతకు నవతకు రసప్రవాహమై..
 
పలికినది పిలిచినది..
పరవశమై నవమోహనరాగం
 
పలికినది పిలిచినది..

మలయాద్రి పవనాల అలాపనై
మధుమాస యామిని ఉద్ధీపనై
మలయాద్రి పవనాల అలాపనై
మధుమాస యామిని ఉద్ధీపనై...
అనురాగానికి ఆది తాళమై..
అనురాగానికి ఆది తాళమై
ఆనందానికి అమర నాదమై
 
 
పలికినది పిలిచినది...
పరవశమై నవమోహనరాగం
పలికినది పిలిచినది..

1 comments:

ఇందులో తొలి సంధ్య వేళలో కూడా చాలా బావుంటుందండీ..అందరూ మోస్ట్ లీ అదే ప్రెజెంట్ చేస్తుంటారు..కానీ ఈ పాట కూడా మా కోసం అందించినందుకు థాంక్స్ వేణూజీ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.