శుక్రవారం, ఏప్రిల్ 17, 2015

వెన్నెలవే వెన్నెలవే...

మెరుపు కలలు చిత్రం కోసం రెహమాన్ స్వరపరచిన ఒక చక్కని మెలోడీ ఈరోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేయవచ్చు.


చిత్రం : మెరుపుకలలు(1997)
సంగీతం : ఏ.ఆర్.రెహ్మాన్ 
సాహిత్యం : వేటూరి
గానం : హరిహరన్, సాధనాసర్గమ్

వెన్నెలవే వెన్నెలవే .. మిన్నే దాటి వస్తావా
విరహానా జోడీ నీవే ! హేయ్..
వెన్నెలవే వెన్నెలవే .. మిన్నే దాటి వస్తావా
విరహానా జోడీ నీవే ! హేయ్..హే..
 

వెన్నెలవే వెన్నెలవే .. మిన్నే దాటి వస్తావా
విరహానా జోడీ నీవే !
నీకు భూలోకులా కన్ను సోకేముందే
పొద్దు తెల్లారేలోగా పంపిస్తా …

ఇది సరాసాలా తొలిపరువాలా
జత సాయంత్రం సయ్యన్న మందారం
ఇది సరాసాలా తొలిపరువాలా
జత సాయంత్రం సయ్యన్న మందారం
చెలి అందాలా చెలి ముద్దాడే
చిరు మొగ్గల్లో సిగ్గేసే పున్నాగం

పిల్లా .. పిల్లా ..
భూలోకం దాదాపు కన్నూ మూయు వేళా ..
పాడేను కుసుమాలు పచ్చాగడ్డి మీనా
ఏ పూవుల్లో తడి అందాలో అందాలే ఈ వేళా !

వెన్నెలవే వెన్నెలవే .. మిన్నే దాటి వస్తావా
విరహానా జోడీ నీవే !
నీకు భూలోకులా కన్ను సోకేముందే
పొద్దు తెల్లారేలోగా పంపిస్తా …

 
ఎత్తైనా గగనంలో నిలిపేవారెవరంటా
కౌగిట్లో చిక్కుపడే గాలికి అడ్డెవరంటా
 
ఇది గిల్లీ గిల్లీ వసంతమే ఆడించే
హృదయములో వెన్నెలలే రగిలించేవారెవరూ

పిల్లా .. పిల్లా ..
పూదోట నిదరోమ్మని పూలే వరించు వేళా
పూతీగ కలలోపల తేనే గ్రహించు వేళా
ఆ వయసే రసాల విందైతే .. ప్రేమల్లే ప్రేమించు !

వెన్నెలవే వెన్నెలవే .. మిన్నే దాటి వస్తావా
విరహానా జోడీ నీవే !
నీకు భూలోకులా కన్ను సోకేముందే
పొద్దు తెల్లారేలోగాపంపిస్తా


1 comments:

ఈ పాటలో కాజల్, ప్రభుదేవా దగ్గిరైన వెంటనే థెయేటర్ లో విపరీతమైన అల్లరి..భలే నవ్వొచ్చింది..బ్యూటిఫుల్ సాంగ్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.