సోమవారం, మార్చి 23, 2015

గాలికి కులమేది...

కర్ణ చిత్రంలో సుశీల గారు గానం చేసిన ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : కర్ణ (1963)
సంగీతం : విశ్వనాధం రామ్మూర్తి
సాహిత్యం : సినారె
గానం : సుశీల

గాలికి కులమేది?
గాలికి కులమేది?
ఏదీ నేలకు కులమేది
 
గాలికి కులమేది?
ఏదీ నేలకు కులమేది
గాలికి కులమేది?
మింటికి మరుగేది ఏదీ.ఈఈ. 
మింటికి మరుగేదీ..
ఏదీ కాంతికి నెలవేదీ..

గాలికి కులమేది?
ఏదీ నేలకు కులమేదీ..ఈ..
గాలికి కులమేది? 

పాలకు ఒకటే...ఏ..ఏ...ఆఆఆ...ఆఆ 
పాలకు ఒకటే తెలివర్ణం
ఏదీ ప్రతిభకు కలదా స్థలబేధం
వీరుల కెందుకు కులబేధం
అది మనసుల చీల్చెడు మతబేధం

గాలికి కులమేది?
ఏదీ నేలకు కులమేదీ..ఈ..
గాలికి కులమేదీ..ఈ...

జగమున యశమే..ఏఏఏ...
జగమున యశమే మిగులునులే
అది యుగములకైనా చెదరదులే
దైవం నీలో నిలుచునులే
ధర్మం నీతో నడచునులే
ధర్మం నీతో నడచునులే

గాలికి కులమేది?
ఏదీ నేలకు కులమేదీ..ఈ..
గాలికి కులమేది?


1 comments:

పిల్లలకి మీనింగ్ చెప్పి వినిపించ వలిసిన పాటల్లో ఇదీ ఒకటి..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.