ఆదివారం, మార్చి 22, 2015

ఇంతకంటె వేరే అందగత్తెలు...

ఊహలు గుస గుసలాడే సినిమా కోసం కళ్యాణి కోడూరి గారు స్వరపరచిన ఒక చక్కని పాట ఈరోజు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : ఊహలు గుసగుసలాడే (2014)
సంగీతం : కళ్యాణి కోడూరి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : హేమచంద్ర

ఇంతకంటె వేరే అందగత్తెలు
కనబడలేదని అనననుకోమరి
ఎందరెదురైనా సుందరాంగులు
తడబడి ఎరుగదు మనసీ మాదిరి
ఎందుకంటె ఏమో ఎందుకూ అని
తెలియక తికమక పడుతున్నది మది

ఇంతకంటె వేరే అందగత్తెలు
కనబడలేదని అనననుకోమరి
ఎందరేదురైనా సుందరాంగులు
తడబడి ఎరుగదు మనసీ మాదిరి

కోపగించి బుంగమూతి పెట్టినా
నిరాకరించి పళ్ళు నూరి తిట్టినా
మహాద్భుతం అనేట్టుగానే ఉంది అనుకున్నా
ఇదేదో పిచ్చి కదా మరీ అనెవ్వరైన అంటె
నిజమేనని ఒప్పేసుకుంట
అంతేగాని తన వెనకనే పడిన మనసునీ
ఒద్దొద్దు అని నేనేమైన ఆపగలనా
ఆ పిచ్చే బాగుందని మరింత పెంచుకుని 
ఇలాగే ఉంటానంతే తప్పైనా ఒప్పైనా గాని.. 

ఇంతకంటె వేరే అందగత్తెలు
కనబడలేదని అనననుకోమరి
ఎందరేదురైనా సుందరాంగులు
తడబడి ఎరుగదు మనసీ మాదిరి

కత్రినా కరీనా అంటు కొంతమంది
కోసమే కుర్రాళ్ళు అంత కొట్టుకుంటె
లోకమందు ఇన్ని వేల జంటలుండవేమో
నా కళ్ళతోటి చూస్తే సరీ తనను మించి
మరొకరు లేరనీ అంటారు కద
ఎవ్వరైన అలా అన్నారని ఊరంతా వచ్చి
తనని నా కళ్ళతోటి చూస్తనంటే చూడగలనా
నువ్వు నాకే సొంతమనీ తనకే చెప్పాలనీ 
అనుకోడమె కానీ పైకేమో అనలేకపోతున్న

ఇంతకంటె వేరే అందగత్తెలు
కనబడలేదని అనననుకోమరి
ఎందరెదురైనా సుందరాంగులు
తడబడి ఎరుగదు మనసీ మాదిరి
యాహూ..ఊఊఊ...హూ...హూ... 
యాహూహూ...హూహూ....
యాహూ..ఊఊఊ...హూ...హూ... 
యాహూహూ...హూహూ.... 

1 comments:

ఈ పాట వింటుంటే యెందుకో ..గుప్పు గుప్పు మన్నదంటా..బీట్ (రక్షణ) లోది గుర్తు వస్తోందండీ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.