మంగళవారం, మార్చి 17, 2015

మువ్వలా నవ్వకలా...

పౌర్ణమి సినిమా కోసం సిరివెన్నెల గారు రాసిన ఈ పాట నాకు చాలా ఇష్టం చిత్రీకరణ కూడా ఛాలాబాగుంటుంది. మీరూ చూడండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : పౌర్ణమి (2006)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, చిత్ర

ఓ...ఓ..ఓ...
ఓ..ఓ...ఓ....
మువ్వలా నవ్వకలా... ముద్దమందారమా
మువ్వలా నవ్వకలా... ముద్దమందారమా
ముగ్గులో దించకిలా... ముగ్ధ సింగారమా
నేలకే నాట్యం నేర్పావే... నయగారమా
గాలికే సంకెళ్లేశావే... ఏ...ఏ...

నన్నిలా మార్చగల కళ నీ సొంతమా...
ఇది నీ మాయ వల కాదని అనకుమా...
ఆశకే ఆయువు పోశావే... మధుమంత్రమా...
రేయికే రంగులు పూశావే...ఏ..ఏ..

కలిసిన పరిచయం ఒకరోజే కదా...
కలిగిన పరవశం... యుగముల నాటిదా..
కళ్లతో చూసే నిజం నిజం కాదేమో..
గుండెలో ఏదో ఇంకో సత్యం ఉందేమో...
ఓ...ఓ...ఓ...ఓ...

నన్నిలా మార్చగల కళ నీ సొంతమా...
ఇది నీ మాయవల కాదని అనకుమా...
నేలకే నాట్యం నేర్పావే... నయగారమా
గాలికే సంకెళ్లేశావే...ఏ...ఏ...

పగిలిన బొమ్మగా మిగిలిన నా కథ..
మరియొక జన్మగా మొదలౌతున్నదా...
పూటకో పుట్టుక ఇచ్చే వరం ప్రేమేగా...
మనలో నిత్యం నిలిచే ప్రాణం తనేగా...
ఓ...ఓ...ఓ...ఓ...

మువ్వలా నవ్వకలా... ముద్దమందారమా
ముగ్గులో దించకిలా... ముగ్ధ సింగారమా
ఆశకే ఆయువు పోశావే... మధుమంత్రమా
రేయికే రంగులు పూశావే..ఏ...ఏ..


1 comments:

ఈ మూవీ డేన్స్ బేస్డ్ థీం, అద్భుతమైన సాంగ్స్, ముఖ్యంగా క్లైమాక్స్ సాంగ్..కానీ ఇంతకీ అసలు విషయమేదయా అన్నట్టు డేన్సే కనిపించదు..టూ మచ్ కదండీ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.