బుధవారం, ఫిబ్రవరి 04, 2015

నీ లీల పాడెద దేవా...

జానకి గారు పాడిన ఒక చక్కని పాట ఈ రోజు గుర్తు చేసుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలనుకుంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 



చిత్రం : మురిపించే మువ్వలు (1962)
సంగీతం : ఎస్. ఎం. సుబ్బయ్య నాయుడు 
సాహిత్యం : ఆరుద్ర 
గానం : జానకి

ఆ...ఆ...ఆ...ఆ...
నీ లీల పాడెద దేవా
మనవి ఆలించ వేడెద దేవా
నను లాలించు మా ముద్దు దేవా

నీ లీల పాడెద దేవా
నీ లీల పాడెద దేవా

 

సింధూర రాగంపు దేవా...
ఆ..ఆ..ఆఆ.. ఆ..ఆ..ఆ. ఆఆ
దివ్య శృంగార భావంపు దేవా...
వల్లి చెలువాలు నిను కోరు నీవు రావా...
ఎలమి.. నీ లీల పాడెద దేవా...
 

అనుపమ వరదాన శీల...ఆ...
అనుపమ వరదాన శీల ...
వేగ కనుపించు కరుణాలవాల...
ఎలమి నీ లీల పాడెద దేవా...

నీ లీల పాడెద దేవా...
నను లాలించు నా ముద్దు దేవా
నీ లీల పాడెద దేవా..
నీ లీల పాడెద దేవా....
సగమపని నీ లీల పాడెద దేవా...
నిస్సనిదపమ గామగరిసనీ 
సానిగదమపా మగరిస నిదమప గరిని...
నీ లీల పాడెద దేవా....

 

సా రిస్సా నిసరిస్సా నినిస పపనినిసా 
మమపపనినిసా గగస గగస నినిస పపని 
మమప గగమమపపనినిసస గరిని....
పా నిదపమగరిసని సగగసగగ సగమప గరిసని సగసా...
నినిప మమప నిపనిపసా పనిపసా నిదపమగరి సగసా ....
గామపనిసా నిసగరిసరిని ససనీ నిసదని ససని...
గరిని గరిగ నిరిగరి నిగరిని
నిరిని నిసస నిరిని నిసస నిదప
నిరినిసా ఆ..ఆ ఆ..ఆ
రినీసపానిసాపసామపనిసరీ ఆ...ఆ..ఆ..
సానిపాని ససనీ ససనీ
పానిపస పానిదనీ మాదనిపానిదనీసరిసా
పానిదనిసరిసా...మగాపమ
సాసరిని నీసరిపా సాసని సాససాససాస సరి గరిసని సరిగరిస
రిదనిదపా పనిమప నిదపమ తతదరి సగమప పనిమప 
సనిదనిపనిప పనిమప గరినిసదనిమపని ...

నీ లీల పాడెద దేవా
నను లాలించు నా ముద్దు దేవా
నీ లీల పాడెద దేవా


5 comments:

వేణూ గారూ..చాలా రోజుల క్రితం నేను పోస్ట్ చేసిన 'చేతికి గాజుల్లా..కళ్ళకు కాటుకలా' అనే 'రాధా కల్యాణం సినిమా' పాట మీరు బ్లాగ్ లో పెట్టారు..గుర్తుందా..ఇప్పుడు వీలైతే 'రావణుడే రాముడైతే' అనే సినిమా నుంచి 'రవి వర్మకే అందనీ', 'కనులలో నీ రూపం' అన్న ఒరిజినల్ వీడియోలు పోస్ట్ చేయగలరు..

గుర్తుంది రాంపండు గారు. తప్పకుండా మీరడిగిన పాటలు పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను.

సన్నాయి రాగాలతో తో పోటీ పడి స్వరార్చన చేసిన మన జానకమ్మ గొంతుకి సాటి, పోటి ఆమే కాక ఇంకెవరు..

మంచి పాట. ఈ పాటను ముందు లీలగారిని పాడమని అడిగారనీ, ఆవిడ ఇది జానకి గాత్రంలో బాగుంటుందని చెప్పాలనీ లోగడ ఒక పత్రికలో చదివాను.

ఇది సుశీల గారు పాడలేదని నాకు చాలా విచారంగా ఉండేది!

అన్నట్లు చిన్న సవరణ. 'ఎలనీ' కాదండీ 'ఎలమి' అని ఉండాలి. టపా సరిచేయగలరు.

థ్యాంక్స్ శ్యామలీయం గారూ.. పోస్ట్ సరిచేశానండీ.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.