శుక్రవారం, ఫిబ్రవరి 27, 2015

ఓ సఖి.. ఒహో చెలి...

జగదేక వీరుని కథ సినిమాలోని ఒక చక్కని పాట ఈరోజు గుర్తుచేసుకుందాం. అన్నగారు ఎంత హాండ్సమ్ గా ఉంటారో ఈ పాటలో. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : జగదేకవీరుని కథ (1961)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : పింగళి
గానం : ఘంటసాల

ఓ... దివ్య రమణులారా...
నేటికి కనికరించినారా...
కలకాదు కదా సఖులారా...

ఓ సఖి.. ఒహో చెలి.. ఒహో మదీయ మోహిని
ఓ సఖి.. ఒహో చెలి.. ఒహో మదీయ మోహిని..
ఓసఖి...

కలలోపల కనిపించి వలపించిన చెలులోహొ...ఓ...ఓ..
కలలోపల కనిపించి వలపించిన చెలులోహొ....
కనుల విందు చేసారే....ఏ..ఏ..ఏ...
కనుల విందు చేసారిక ధన్యుడనైతిని నేనహ..

ఓ సఖి... ఒహో చెలి ...ఒహో మదీయ మోహిని
ఓసఖి...

 
నయగారములొలికించి... ప్రియరాగము పలికించి
నయగారములొలికించి... ప్రియరాగము పలికించి
హాయినొసుగు ప్రియలేలే... ఏ..ఏ..ఏ...
హాయినొసుగు ప్రియలే మరి మాయని సిగ్గులు ఏలనే...

ఓ సఖి.. ఒహో చెలి.. ఒహో మదీయ మోహిని
ఓసఖి...


కను చూపులు ఒక వైపు...మనసేమొ నా వైపు
కను చూపులు ఒక వైపు...మనసేమొ నా వైపు
ఆటలహొ తెలిసెనులే...ఏ...ఏ...
ఆటలహొ తెలిసెను చెలగాటము నా కడ చెల్లునె...

ఓ సఖి... ఒహో చెలి ...ఒహో మదీయ మోహిని..

1 comments:

కల లాటి కధ..కమ్మనైన పాట..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.