ఆదివారం, ఫిబ్రవరి 22, 2015

తెలుసుకొనవే చెల్లి..

ఈ అక్కగారు తన చెల్లెలికి బోధిస్తున్న నీతులేవిటో మీరూ వినండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : మిస్సమ్మ (1955)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు
సాహిత్యం : పింగళి
గానం : పి.లీల

తెలుసుకొనవే చెల్లి.. అలా నడుచుకొనవే చెల్లీ
తెలుసుకొనవే చెల్లి

మగవారికి దూరముగ మగువలెపుడు మెలగాలని
మగవారికి దూరముగ మగువలెపుడు మెలగాలని

తెలుసుకొనవే చెల్లి.. అలా నడుచుకొనవే చెల్లీ
తెలుసుకొనవే చెల్లి

మనకు మనమె వారికడకు పని ఉన్నా పోరాదని
ఆఆ.ఆఆఆఆఆఆఆఆఆ..
మనకు మనమె వారికడకు పని ఉన్నా పోరాదని
అలుసు చేసి నలుగురిలో చులకనగ చూసెదరని
అలుసు చేసి నలుగురిలో చులకనగ చూసెదరని

తెలుసుకొనవే చెల్లి... అలా నడుచుకొనవే చెల్లీ
తెలుసుకొనవే చెల్లి

పదిమాటలకొక మాటయు బదులు చెప్పకూడదని
ఆఆఆఆఆఆఆఆఆ...ఆ..ఆ..
పదిమాటలకొక మాటయు బదులు చెప్పకూడదని
లేని పోని అర్థాలను మన వెనుకనె చాటెదరని
లేని పోని అర్థాలను మన వెనుకనె చాటెదరని

తెలుసుకొనవే చెల్లి... అలా నడుచుకొనవే చెల్లీ
తెలుసుకొనవే చెల్లి...

3 comments:

నిన్నటి వాడుకమరెచెదవేల పాటకి వ్యాక్య పెడదాం అనుకునేలోపు మరో మంచి పాటనందించినందుకు చాలా ధన్యవాదాలు.నాలాంటి పాత పాటల పిచ్చి వాళ్ళకు మీరు,రాజ్యలక్ష్మి గారు మంచి మంచి పాటలను పోస్టు చేస్తున్నారు.నేనైతే ఈ పాత పాటల లోకంలోనే విహరిస్తుంటా.అందించినందుకు ధన్యవాదాలు.

థాంక్స్ లక్ష్మి గారు :-)

"పదిమాటలకొక మాటయు బదులు చెప్పకూడదని
లేని పోని అర్థాలను మన వెనుకనె చాటెదరని"..బెస్ట్ టిప్ ఫర్ వర్కింగ్ ఉమెన్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.