బుధవారం, ఫిబ్రవరి 11, 2015

నీ పిలుపే ప్రేమగీతం...

చూడకుండా ప్రేమించుకోవడమనే ట్రెండ్ ను పాపులర్ చేసిన "ప్రేమలేఖ" చిత్రంలో ప్రేమను గురించి తెలిపే ఒక చక్కని పాట ఇది. డబ్బింగ్ పాటే అయినా కూడా భువన చంద్ర గారు చక్కని సాహిత్యాన్నిచ్చారు. దేవా సంగీతం బాగుంటుంది. పాట చిత్రీకరణలో మొదట్లో వచ్చే పక్షుల జంట నేపధ్యానికి తగినట్లు భలే ఉంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ప్రేమలేఖ (1996)
సంగీతం : దేవా
సాహిత్యం : భువనచంద్ర
గానం : ఉన్నికృష్ణన్ , చిత్ర

నీ పిలుపే ప్రేమగీతం
నీ పలుకే ప్రేమవేదం
ఆశలే బాసలై
కలలు కనే పసి మనసులై
కవితలు పాడీ
కవ్వించని కవ్వించని కవ్వించనీ

 
కళ్ళు కళ్ళు మూసుకున్నా
హృదయంతో మాటాడునమ్మా ప్రేమా
నిద్దుర చెదిరి పోయేనమ్మా
నేస్తం కోసం వెతికేనమ్మా ప్రేమా
ఆడించి పాడించి అనురాగం కురిపించీ
అలరించేదే ప్రేమా
రమ్మంటే పొమ్మంటూ పొమ్మంటే రమ్మంటూ
కవ్వించేదే ప్రేమా
ప్రేమలకు హద్దు లేదులే
దాన్ని ఎవ్వరైన ఆపలేరులే

నీ పిలుపే ప్రేమగీతం
 
జాతి లేదు మతము లేదు
కట్నాలేవి కోరుకోదు ప్రేమా
ఆది లేదు అంతం లేదు
లోకం అంతా తానై ఉండును ప్రేమా
ఊరేదో పేరేదో కన్నోళ్ళ ఊసేదో
అడగదు నిన్ను ప్రేమా
 
నాలోనా నీవుండి నీలోనా నేనుండి
జీవించేదే ప్రేమా
జాతకాలు చూడబోదులే
ఎన్ని జన్మలైనా వీడిపోదులే
 
 
నీ పిలుపే ప్రేమగీతం
నీ పలుకే ప్రేమవేదం
ఆశలే బాసలై
కలలు కనే పసి మనసులై
కవితలు పాడీ
కవ్వించని కవ్వించని కవ్వించనీ


1 comments:

గుండెల్లో మొదలై కనులలో వెలిగే ప్రేమ గీతం..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.