మంగళవారం, ఫిబ్రవరి 10, 2015

ప్రతిదినం నీ దర్శనం...

వంశీ ఇళయరాజా గారి కాంబినేషన్ లో చాలా కాలం గ్యాప్ తర్వాత వచ్చిన ఈపాట ప్రారంభంలో వచ్చే ఆలాపన తోనే సంగీతాభిమానుల మనసుల్లో శాశ్వత స్థానం సంపాదించేసుకుంటుంది. ఇక పాట మొత్తం స్వరం సాగిన తీరు అది ఉన్ని కృష్ణన్, శ్రేయా ఘోషల్ లు పాడిన తీరు, ఇంత అందమైన పాటను వంశీగారు చిత్రీకరించిన తీరు అన్నీ వేటికవే సాటి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : అనుమానాస్పదం (2007)
సంగీతం : ఇళయరాజా 
సాహిత్యం : వంశీ
గానం : ఉన్నికృష్ణన్, శ్రేయాఘోషల్ 

నానాన..ననన..నానాన..

నానాన..ననన..నానాన..

ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా..దొరకునా..
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా..జరపనా..
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు..

 
ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా..దొరకునా..
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా..జరపనా..
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు..

ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా..దొరకునా..
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా..ఆ..

నిదురే రాదు రాత్రంతా కలలు నేసే నాకూ..
వినగలనంటే తమాషగా ఒకటి చెప్పనా..చెప్పు..
హహహ చెప్పు..
ఇంధ్రధనుస్సు కిందా ..కూర్చునీ మాట్లాడుదాం..
అల్లగే చందమామతోటీ..కులాసా ఊసులాడదాం..
వింటుంటే వింతగా ఉంది..కొత్తగా ఉంది..ఏమిటీ కథనం ..
పొరపాటు..కథ కాదు..
గత జన్మలోన జాజి పూల సువాసనేమో..

ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా..దొరకునా..
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా..జరపనా..
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు..

ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా..దొరకునా..
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా..జరపనా..ఆ..

 
నా..నా..నా..నానా..
పువ్వుల నదిలో..అందంగా నడుచుకుంటుపోనా..
ఊహల రచనే ..తీయంగా చేసి తిరిగి రానా..
వెన్నెల పొడిమినీ..చెంపలకి రాసి చూడనా..
సంపంగి పూల పరిమళం..వయసుకీ అద్ది ఆడనా..
అదేంటో మైకమే నను వదలినా..పొద జరగదూ నిజమో.. 
జడి వాన కురవాలీ..
ఎద లోయలోకి జారిపోయి దారి చూడూ..
 
ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా..దొరకునా..
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా..జరపనా.. 
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు..
 
ప్రతి.. దినం నీ దర్శనం మరి దొరకునా..దొరకునా..
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా..ఆ..


1 comments:

పాట వంశీ మార్క్ దే..హీరో హీరోయిన్లే..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.