సోమవారం, జనవరి 19, 2015

ఇది మౌనగీతం...

ఆషా భోంస్లే గారు తెలుగులో పాడిన మొదటి పాట ఇది. చిన్నపుడు రేడియోలో వింటూ తన స్వరంలో తెలుగు నాజూకుగా స్టైల్ గా పలకడం చాలా ఆసక్తిగా గమనించేవాడ్ని. సత్యం గారి సంగీతం వీనుల విందుగా ఉంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : పాలు నీళ్ళు (1981) 
సంగీతం : సత్యం 
సాహిత్యం : దాసరి 
గానం : ఆషాభోంస్లే 

ఆఆఆఆఅ..ఆఆఆఆఆ...
ఇది మౌనగీతం ఒక మూగరాగం 
పాడింది పెల్లుబికి కళ్యాణి రాగం 
పాడింది పెల్లుబికి కళ్యాణి రాగం 

ఇది మౌనగీతం ఒక మూగరాగం 
పాడింది పెల్లుబికి కళ్యాణి రాగం
పాడింది పెల్లుబికి కళ్యాణి రాగం 
 ఇది మౌనగీతం...

పట్టపగలు చందమామ పొడిచిన రోజూ
ఆకాశం హరివిల్లై వంగిన రోజూ
పట్టపగలు చందమామ పొడిచిన రోజూ
ఆకాశం హరివిల్లై వంగిన రోజూ
కడలి పొంగి ఆడిన రోజు 
 మూగ గొంతు పాడిన రోజు 
కడలి పొంగి ఆడిన రోజు 
మూగ గొంతు పాడిన రోజు
దొరకక దొరకక...
దొరకక దొరకక దొరికిన రోజు 
దొరికీ దొరకక దొరకని రోజు 
ఒకే ఒక్క రోజు తిరిగిరాని రోజు
ఒకే ఒక్క రోజు తిరిగిరాని రోజు 

ఇది మౌనగీతం ఒక మూగరాగం 

వెన్నెలంతా మల్లెలై పూచిన రోజూ
మల్లెలన్నీ తారలై మెరిసిన రోజూ 
వెన్నెలంతా మల్లెలై పూచిన రోజూ
మల్లెలన్నీ తారలై మెరిసిన రోజూ
గుండెబరువు మరిచిన రోజు 
పాల గుండె పొంగిన రోజు 
గుండెబరువు మరిచిన రోజు 
పాల గుండె పొంగిన రోజు 
మిగలక మిగలక
మిగలక మిగలక మిగిలిన రోజు 
మిగిలీ మిగలక మిగలని రోజు
ఒకే ఒక్క రోజు తిరిగిరాని రోజు  
ఒకే ఒక్క రోజు తిరిగిరాని రోజు 

ఇది మౌనగీతం ఒక మూగరాగం
పాడింది పెల్లుబికి కళ్యాణి రాగం 
పాడింది పెల్లుబికి కళ్యాణి రాగం 
ఇది మౌనగీతం


1 comments:

అప్పటి సింగర్స్ యే భాష వారైనా లాంగ్వేజ్ పట్ల ఓ కమిట్మెంట్ ఉండేదనుకుంటండీ..అందుకే లతాజీ ఐనా, రఫీగారైనా, ఆషాజీ ఐనా వింటున్నప్పుడు భావం కనులముందుంటుంది..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.