సోమవారం, డిసెంబర్ 08, 2014

కావాలంటే ఇస్తాలే...

నన్ను ఏ.ఎమ్.రాజా గారికి అభిమానిగా మార్చేసిన పాట ఇది. సాలూరి వారి స్వర సారధ్యంలో తను పాడిన విధానం దానికి అన్నగారి అభినయం వహ్వా ఎన్ని విధాలుగా వర్ణించి చెప్పినా తక్కువే అసలు వర్ణించడానికి మాటలు చాలవు అంతే. నాకు చాలా ఇష్టమైన ఈ పాటను మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : మిస్సమ్మ (1955)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : పింగళి
గానం : ఏ. ఎం. రాజా

ఆ...  ఆ... ఆ... ఆ..
ఈ నవనవాభ్యుదయ విశాల సృష్టిలో...
ఓ... ఓ.. ఓ... ఓ..
ఈ నవనవాభ్యుదయ విశాల సృష్టిలో
చిత్రములన్నీ నావేలే
కావాలంటే ఇస్తాలే.. నావన్నీ ఇక నీవేలే
కావాలంటే ఇస్తాలే.. నావన్నీ ఇక నీవేలే

ఆ.. ఆ.. ఆ.. ఆ..
తళుకు తళుకుమని తారలు మెరిసే
నీలాకాశము.. నాదేలే
ఎల్లరి మనముల కలవర పరిచే
జిలిబిలి జాబిలి.. నాదేలే

కావాలంటే ఇస్తాలే.. నావన్నీ ఇక నీవేలే
కావాలంటే ఇస్తాలే.. నావన్నీ ఇక నీవేలే

 

ఆ.. ఆ.. ఆ.. ఆ...
ప్రశాంత జగమును హుషారు చేసే
వసంత ఋతువు.. నాదేలే
పూవుల ఘుమ ఘుమ చల్లగ విసిరే
మలయమారుతము.. నాదేలే

కావాలంటే ఇస్తాలే... నావన్నీ ఇక నీవేలే
కావాలంటే ఇస్తాలే... నావన్నీ ఇక నీవేలే



2 comments:

ఈ అబ్బాయి ఇచ్చేవే హాయిగా ఉన్నాయండీ..వీటి కోసం సవత్సరాల తరబడి బడ్జెట్ ప్లానింగులూ..అంతే లేని ఓవర్ టైమింగులూ అవసరం లేదు..

అంతేకదండీ మరి అందుకె తెలివైన కుర్రాడు అలా ప్రామిస్ చేస్తున్నాడు :-) థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.