గురువారం, డిసెంబర్ 11, 2014

నిలువుమా నిలువుమా నీలవేణీ...

అమరశిల్పి జక్కన లోని ఓ మధుర గీతం ఈరోజు మీకోసం. సాలూరి వారి సంగీతం అంటే ఎంత శ్రావ్యమైన గీతమో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా.. నాకు చాలా ఇష్టమైన ఈ పాట మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : అమరశిల్పి జక్కన (1964)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : సముద్రాల (సీనియర్)
గానం : ఘంటసాల, సుశీల

నిలువుమా నిలువుమా నీలవేణీ
నీ కన్నుల నీలినీడ నా మనసు నిదురపోనీ
నిలువుమా నిలువుమా నీలవేణీ

అడుగడుగున ఆడే లేనడుమూ సొంపులా
అడుగడుగున ఆడే లేనడుమూ సొంపులా
తడబడే అడుగుల నటనల మురిపింపులా
తడబడే అడుగుల నటనల మురిపింపులా

సడిసేయక ఊరించే...
సడిసేయక ఊరించే... ఒయారపు ఒంపులా
కడకన్నుల ఇంపులా గడసరి కవ్వింపులా
నడచిరా నడచిరా నాగవేణీ
నీ కన్నుల నీలినీడ నా మనసూ నిదురపోనీ

అద్దములో నీ చెలువు తిలకించకు ప్రేయశీ..

అలిగేవూ నీ సాటి చెలిగా తలపోసి
అలిగేవూ నీ సాటి చెలిగా తలపోసి
నా ఊర్వశి రావే రావే అని పిలువనా
నా ఊర్వశి రావే రావే అని పిలువనా

ఆ సుందరి నెర నీటూ నీ గోటికి సమమౌనా
నా చెలి నిను మదీ దాచుకోనీ

నీ కన్నుల నీలినీడ నా మనసూ నిదురపోనీ.


2 comments:

కొండకచో "ఓ వాలుజడా" వంటి పాటలున్నా.."కొప్పున పూలెట్టుకొనీ బుగ్గన చుక్కెట్టుకొనీ వీధంటా నువ్వెళ్తుంటే"..అమ్మాయిల వర్ణన లో ఇంత డ్రాస్టిక్ చేంజ్ తీసుకొచ్చిన సినీ కవులు ఒక్కసారి ఈ పాట వినాలని మనవి..

ఏ పాట అందం దానిదే అనిపిస్తుంటుందండీ నాకైతే ఒకటి సెలయేరైతే ఒకటి జలపాతం అంతే తేడా.. థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.