ఆదివారం, నవంబర్ 02, 2014

ఓ ప్రియా...

చండీప్రియ సినిమాలోని ఒక చక్కని యుగళ గీతం ఈ రోజు మీకోసం. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు.


చిత్రం : చండీప్రియ (1980)
సంగీతం : ఆదినారాయణరావు
సాహిత్యం : సినారె
గానం : బాలు, సుశీల

ఓ ప్రియా... ప్రియా
చండీప్రియా... ప్రియా
 
తొలి గిలిగింతలు కలిగించిందా 
నా ప్రేమలేఖా.. నడిచే చంద్రరేఖ

ఓ ప్రియా... ప్రియా
చండీప్రియా... ప్రియా
తొలి గిలిగింతలు కలిగించింది
నీ ప్రేమలేఖా.. నీదే ఈ చంద్రరేఖ

మనసులో... ప్రతి మలుపులో..
నిను మలుచుకున్నానులే
కలలో... మధువనులలో..
నీ పిలుపు విన్నానులే
 
మనసులో... ప్రతి మలుపులో..
నిను మలుచుకున్నానులే
కలలో... మధువనులలో..
నీ పిలుపు విన్నానులే
 
ఆ చెలియ రూపాల చేరుకున్నావా
పలికే రాగరేఖ..
కలా?
నిజం..నిజం?
మ్మ్..

ఓ ప్రియా... ప్రియా
చండీప్రియా... ప్రియా 
తొలి గిలిగింతలు కలిగించింది
నీ ప్రేమలేఖా.. నీదే ఈ చంద్రరేఖ

ఎవ్వతే నీ ఎవ్వాతే
ఒలికించుతావు వగలు
ఏమీటే కథ ఏమిటే ..
కురిపించుతావు సెగలు
ఆశను ..జీవితాశను..
నే చెదిరితే విషాదం
చండిని .. అపర చండిని
నను కదిపితే ప్రమాదం

నీవు నా కైపు.. తాను
నా వైపు అయ్యో ఏమి రాత..
అటా?
ఇటూ...
ఏటు?
ఇటూ ..

ఓ ప్రియా... ప్రియా
చండీప్రియా... ప్రియా
 
తొలి గిలిగింతలు కలిగించిందా 
నా ప్రేమలేఖా.. నడిచే చంద్రరేఖ
తొలి గిలిగింతలు కలిగించింది
నీ ప్రేమలేఖా.. నీదే ఈ చంద్రరేఖ


2 comments:

ఈ పాటలో జయప్రద చాలా అందంగా ఉంటుందండీ..అఫ్కోర్స్ యే పాటలోనైనా అందమే ఆమె చిరునామా అనుకోండీ..

కరెక్టండీ జయప్రద గారు ఏ సినిమాలోనైనా అందంగానే ఉంటారు :-) థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.